News August 24, 2024

1,130 కానిస్టేబుల్ ఉద్యోగాలకు నోటిఫికేషన్

image

సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్(CISF)లో 1,130 కానిస్టేబుల్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నెల 31 నుంచి సెప్టెంబర్ 30 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఇంటర్ పూర్తై, 01-10-2001 నుంచి 30-09-2006 మధ్య జన్మించిన వారు అర్హులు. PET, PST, సర్టిఫికెట్ వెరిఫికేషన్, రాత పరీక్ష ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. పే స్కేల్ రూ.21,700-69,100 ఉంటుంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ <>క్లిక్<<>> చేయండి.

Similar News

News March 5, 2026

బెంగాల్ గవర్నర్ రాజీనామా

image

వెస్ట్ బెంగాల్ గవర్నర్ పదవికి సీవీ ఆనంద్ బోస్ రిజైన్ చేశారు. తన రాజీనామా లెటర్‌ను రాష్ట్రపతి ముర్ముకు పంపారు. అయితే దీనికి కారణమేంటనేది తెలియాల్సి ఉంది. బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు బోస్ తీసుకున్న ఈ నిర్ణయం చర్చనీయాంశమవుతోంది. రాష్ట్ర గవర్నర్‌గా ఆయన మూడున్నరేళ్లు పని చేశారు. మరోవైపు లద్దాక్ లెఫ్టినెంట్ గవర్నర్ కవీందర్ గుప్తా కూడా రాజీనామా చేసినట్లు సమాచారం.

News March 5, 2026

వాహనాలపై కొత్తగా రహదారి భద్రతా సెస్: మంత్రి

image

AP: రోడ్డు ప్రమాదాల నివారణకు GOVT కీలక నిర్ణయం తీసుకుంది. వాహనాలపై కొత్తగా 10% రహదారి భద్రతా సెస్‌ను విధించనున్నట్లు మంత్రి రాంప్రసాద్ రెడ్డి అసెంబ్లీలో ప్రకటించారు. ‘రిజిస్ట్రేషన్ సమయంలో లైఫ్ ట్యాక్స్‌తో పాటు దీన్ని వసూలు చేస్తారు. ఏడాదికి ₹270CR వస్తుంది. రహదారి భద్రతా సదుపాయాలు, బ్లాక్‌స్పాట్ల మెరుగుదలకు దీన్ని వినియోగిస్తాం’ అని తెలిపారు. ఈమేరకు సవరణ బిల్లును మంత్రి సభలో ప్రవేశపెట్టారు.

News March 5, 2026

బ్యాంక్ ట్రాన్సాక్షన్స్.. లిమిట్ దాటితే!

image

కొందరు పెద్ద మొత్తంలో ట్రాన్సాక్షన్స్ చేస్తుంటారు. కానీ IT చట్టం ప్రకారం లిమిట్ దాటితే అధికారులు నోటీసులు పంపుతారని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఆర్థిక సంవత్సరంలో సేవింగ్స్ అకౌంట్‌లో రూ.10L కంటే క్యాష్ డిపాజిట్ చేసినా అధికారులు ఐటీ శాఖకు ఇన్ఫార్మ్ చేస్తారు.₹10L కంటే విలువైన విదేశీ వస్తువులు, ప్రయాణాలు చేసినా ఐటీ క్వశ్చన్ చేస్తుంది. ఎక్కువ మొత్తంలో క్రెడిట్ కార్డు బిల్లులు ఉన్నా నోటీసులు రావొచ్చు.