News August 24, 2024
1,130 కానిస్టేబుల్ ఉద్యోగాలకు నోటిఫికేషన్
సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్(CISF)లో 1,130 కానిస్టేబుల్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నెల 31 నుంచి సెప్టెంబర్ 30 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఇంటర్ పూర్తై, 01-10-2001 నుంచి 30-09-2006 మధ్య జన్మించిన వారు అర్హులు. PET, PST, సర్టిఫికెట్ వెరిఫికేషన్, రాత పరీక్ష ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. పే స్కేల్ రూ.21,700-69,100 ఉంటుంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ <
Similar News
News September 10, 2024
రేపు నందిగం సురేశ్‌ను పరామర్శించనున్న జగన్
AP: మాజీ సీఎం జగన్ రేపు గుంటూరు జిల్లాలో పర్యటించనున్నారు. ‘ఉ.10 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి గుంటూరు సబ్ జైలుకు చేరుకుంటారు. అక్కడ మాజీ ఎంపీ నందిగం సురేశ్‌ను పరామర్శిస్తారు. అనంతరం ఎస్‌వీఎన్ కాలనీలో క్రోసూరు మార్కెట్ యార్డ్ మాజీ ఛైర్మన్ ఈద సాంబిరెడ్డి నివాసానికి వెళతారు. ఇటీవల టీడీపీ గూండాల దాడిలో తీవ్రంగా గాయపడిన ఆయనను పరామర్శిస్తారు’ అని వైసీపీ ఓ ప్రకటనలో తెలిపింది.
News September 10, 2024
సైబర్ నేరాల అడ్డుకట్టకు 5వేల సైబర్ కమాండోలు
జాతీయ భద్రతలో సైబర్ సెక్యూరిటీ అంతర్భాగమని HM అమిత్ షా అన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో దేశం ఎదుగుదలకు అదెంతో కీలకమన్నారు. ‘మానవాళికి టెక్నాలజీ వరం. ఎకానమీకి ఎంతో ఉపయోగకరం. అదే సమయంలో టెక్నాలజీ వల్ల చాలా ముప్పులు కనిపిస్తున్నాయి. సైబర్ సెక్యూరిటీలో ఇండియన్ సైబర్‌క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్ కీలకం’ అని అన్నారు. సైబర్ నేరాల అడ్డుకట్టకు రాబోయే ఐదేళ్లలో 5000 సైబర్ కమాండోలకు శిక్షణనిస్తామని తెలిపారు.
News September 10, 2024
ఇండియాలో iPhone16 ఫోన్ల తయారీ: అశ్వినీ
యాపిల్ నుంచి రిలీజైన iPhone 16 సిరీస్ ఫోన్లకు మంచి రెస్పాన్స్ వస్తోంది. సరికొత్త డిజైన్, ఫీచర్స్ ఐఫోన్ ప్రియులను కట్టిపడేస్తున్నాయి. అయితే, ఈ ఫోన్లు ఇండియాలో తయారవుతున్నాయని కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్ తెలిపారు. ప్రధాని నరేంద్ర మోదీ తీసుకొచ్చిన ‘మేక్ ఇన్ ఇండియా’ వల్ల ఇది సాధ్యమైందని పేర్కొన్నారు. దిగ్గజ కంపెనీల ఉత్పత్తులు భారత కర్మాగారాల నుంచి ప్రపంచవ్యాప్తం అవుతున్నాయని హర్షం వ్యక్తం చేశారు.