News January 11, 2025
త్వరలోనే 8,000 ఉద్యోగాలకు నోటిఫికేషన్
AP: వైద్య, ఆరోగ్య శాఖలో ఉద్యోగాలు ఖాళీ లేకుండా భర్తీ చేయాలని అధికారులను మంత్రి సత్యకుమార్ ఆదేశించారు. ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేలా డాక్టర్లు, పారా మెడికల్ సిబ్బంది అవసరమన్నారు. మెరుగైన సేవలు అందించేలా 7 నుంచి 8 వేల మంది నియామకాలకు కార్యాచరణ రూపొందించాలన్నారు. ప్రైమరీ ఆస్పత్రుల్లో 28.96%, జిల్లా ఆస్పత్రుల్లో 14.51%, మిగతా చోట్ల 63.40% సిబ్బంది కొరత ఉన్నట్లు అధికారులు ఆయనకు వివరించారు.
Similar News
News January 14, 2025
ఇంగ్లండ్ సిరీసుకు టీమ్ సైజ్ తగ్గించండి: గవాస్కర్
ఇంగ్లండ్ టెస్టు సిరీసుకు టీమ్ సైజును తగ్గించాలని టీమ్ఇండియా లెజెండ్ సునీల్ గవాస్కర్ సలహా ఇచ్చారు. 16 కన్నా ఎక్కువ మందిని ఎంపిక చేయడం సెలక్టర్ల అపనమ్మకాన్ని సూచిస్తోందన్నారు. ఆసీస్‌కు 19 మందిని పంపించడం తెలిసిందే. ఎక్కువ మందిని పంపే స్తోమత BCCIకి ఉన్నా టీమ్ఇండియా క్యాప్ ఈజీగా ఇచ్చేయొచ్చని కాదన్నారు. విదేశాల్లో ప్రాక్టీస్ మ్యాచులు ఎక్కువ ఆడాలని, ఆప్షనల్ ట్రైనింగ్ సెషన్స్ తీసేయాలని చెప్పారు.
News January 14, 2025
ఈ ఏడాదీ బాదుడే.. పెరగనున్న రీఛార్జ్ ధరలు?
గత ఏడాది 25 శాతం వరకు టారిఫ్‌లను పెంచిన టెలికం కంపెనీలు కొత్త సంవత్సరంలోనూ బాదుడుకు సిద్ధమైనట్లు సమాచారం. దాదాపు 10 శాతం ధరలను పెంచే అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. ముఖ్యంగా 5G సేవలకు నిర్దిష్ట ధరలను ప్రవేశపెట్టవచ్చని పేర్కొంటున్నాయి. ధరల పెంపుతో జియో, ఎయిర్‌టెల్, VIల యావరేజ్ రెవెన్యూ కనీసం 25 శాతం పెరుగుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు.
News January 14, 2025
ప్రజలు సంతోషంగా పండుగ చేసుకుంటున్నారు: మంత్రి గొట్టిపాటి
AP: రాష్ట్రంలో సంక్రాంతి కళ లేదంటూ YCP దుష్ప్రచారం చేస్తోందని మంత్రి గొట్టిపాటి రవికుమార్ మండిపడ్డారు. ఎప్పుడూ లేనివిధంగా పొరుగు రాష్ట్రాలు, విదేశాల్లో స్థిరపడినవారు పండుగకు సొంతూళ్లకు వచ్చారని తెలిపారు. ‘₹6,700 కోట్ల బకాయిల విడుదలకు CM ఆమోదం తెలిపారు. ₹850 కోట్లతో రోడ్లను బాగు చేశాం. రైతులకు 24గంటల్లోనే ధాన్యం డబ్బులు చెల్లిస్తున్నాం. దీంతో ప్రజలు సంతోషంగా పండుగ చేసుకుంటున్నారు’ అని పేర్కొన్నారు.