News November 21, 2024

పారామెడికల్, బీపీటీ కోర్సుల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్

image

AP: బీఎస్సీ పారామెడికల్, బ్యాచిలర్ ఆఫ్ ఫిజియోథెరపీ కోర్సుల్లో ప్రవేశాల కోసం NTR హెల్త్ యూనివర్సిటీ నోటిఫికేషన్ ఇచ్చింది. ఇవాళ ఉ.11 గంటల నుంచి DEC 9వ తేదీ వరకు విద్యార్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఓసీ విద్యార్థులు రూ.2360, బీసీ, ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు రూ.1888 చొప్పున రుసుం చెల్లించాలి. 17 ఏళ్లు పైబడిన విద్యార్థులు దరఖాస్తు చేసేందుకు అర్హులు. నోటిఫికేషన్ కోసం ఇక్కడ <>క్లిక్<<>> చేయండి.

Similar News

News December 13, 2024

రూట్ క్లియర్ చేస్తున్న పోలీసులు

image

మరికొద్దిసేపట్లో అల్లు అర్జున్‌ను వైద్యపరీక్షల కోసం పోలీసులు గాంధీ ఆసుపత్రికి తరలించనున్నారు. అనంతరం అక్కడి నుంచి నాంపల్లి కోర్టుకు తీసుకెళ్తారు. ఈమేరకు రూట్ క్లియర్ చేస్తున్నారు.

News December 13, 2024

బన్నీపై నేరం నిరూపణైతే పడే శిక్ష వివరాలు..

image

వ్యక్తి మృతికి కారకులపై BNS (105) సెక్షన్ నమోదు చేస్తారు. దీంతో 5సం.-10సం. శిక్ష పడుతుంది. BNS 118(1) సెక్షన్: ప్రమాదకర ఆయుధాలు, విషం, పేలుడు పదార్థాలతో తీవ్రగాయం చేసేందుకు యత్నించిన వారిపై నమోదు చేస్తారు. దీంతో మూడేళ్ల వరకు జైలు శిక్ష, రూ.20వేల జరిమానా పడొచ్చు. ఇక BNS section 3(5) ప్రకారం ఒక నేరాన్ని పలువురు వ్యక్తులు ఒకే ఉద్దేశంతో చేస్తే, అందులోని అందర్నీ సమానమైన శిక్షార్హులుగా పరిగణిస్తారు.

News December 13, 2024

కాసేపట్లో పోలీస్ స్టేషన్‌కు చిరంజీవి

image

చిక్కడపల్లి పీఎస్‌కు కాసేపట్లో చిరంజీవి చేరుకోనున్నారు. ఓ సినిమా షూటింగ్‌లో ఉన్న ఆయన దాన్ని రద్దు చేసుకున్నారు. పీఎస్‌లో ఉన్న అల్లు అర్జున్‌తో మాట్లాడనున్నారు. కాగా ఇప్పటికే అల్లు అర్జున్‌ను చిక్కడపల్లి పీఎస్‌కు తరలించిన పోలీసులు ఆయన స్టేట్‌మెంట్‌ను రికార్డ్ చేసుకున్నారు. మరోవైపు ఆయనను రిమాండ్‌కు తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. కాసేపట్లో ఆయనను గాంధీ ఆసుపత్రికి తరలించనున్నారు.