News March 26, 2025
9,970 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్

అసిస్టెంట్ లోకో పైలట్ పోస్టుల భర్తీకి రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు(RRB) నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. మొత్తం 9,970 ఉద్యోగాల భర్తీకి ఏప్రిల్ 10 నుంచి దరఖాస్తులు స్వీకరించనుంది. దరఖాస్తు ఫీజు జనరల్/OBCలకు రూ.500, మిగతావారికి రూ.250గా ఉంది. ఐటీఐ, డిప్లొమా, డిగ్రీ ఉన్నవారిని అర్హులుగా పేర్కొంది. సీబీటీ విధానంలో పరీక్ష నిర్వహించనున్నారు. అప్లికేషన్లకు చివరి తేదీ మే 9.
www.indianrailways.gov.in
Similar News
News March 29, 2025
సినిమాలు వద్దని నిరాశపరిచారు: జెనీలియా

వివాహం తర్వాత సినిమాల్లో తిరిగి నటిద్దామంటే తెలిసిన వాళ్లు ఎవరూ సహకరించలేదని సినీ నటి జెనీలియా అన్నారు. పదేళ్ల తర్వాత సినిమాలోకి వస్తే ఏమాత్రం వర్కౌట్ కాదు అని నిరాశపరిచారన్నారు. అయినా వారి మాటలు వినకుండా ధైర్యంతో మూవీల్లో తిరిగి నటించానని తెలిపారు. 2022లో జెనీలియా నటించిన ‘వేద్’ చిత్రం విడుదలై మంచి విజయాన్ని అందుకుంది. తెలుగులో పలు సూపర్ హిట్ చిత్రాల్లో జెనీలియా నటించారు.
News March 29, 2025
డెబ్యూలో ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ.. చరిత్ర సృష్టించాడు

పాక్తో జరిగిన తొలి వన్డేలో కివీస్ ప్లేయర్ మహమ్మద్ అబ్బాస్ చరిత్ర సృష్టించారు. డెబ్యూ మ్యాచ్లోనే ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ(26 బంతుల్లో 52) చేసిన ప్లేయర్గా నిలిచారు. ఇందులో 3 సిక్సులు, 3 ఫోర్లు ఉన్నాయి. అలాగే 7 ఓవర్లు బౌలింగ్ చేసి ఓ వికెట్ కూడా తీశారు. కాగా 5 టీ20ల సిరీస్ను 4-1తో కోల్పోయిన పాక్, 3 వన్డేల సిరీస్ తొలి మ్యాచ్లో 73 పరుగుల తేడాతో ఓడిపోయింది.
News March 29, 2025
వివేకా హత్య కేసు నిందితులకు త్వరలో సినిమా: ఆదినారాయణ రెడ్డి

AP: వివేకా హత్య కేసులో CBI మళ్లీ దర్యాప్తు ప్రారంభిస్తుందని MLA ఆదినారాయణ రెడ్డి అన్నారు. దీంతో ఆ కేసులోని నిందితులకు త్వరలోనే సినిమా కనిపిస్తుందని ఎద్దేవా చేశారు. తాజాగా రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో ఈ కేసుకు సంబంధించి దాఖలు చేసిన అదనపు అఫిడవిట్లో MP అవినాశ్ పాత్రే ఎక్కువగా ఉందని తెలిపారు. మరోవైపు, తనకు YCP నేతల నుంచి ప్రాణహాని ఉందని ఇదే కేసులో నిందితుడు సునీల్ యాదవ్ ఇవాళ కడపలో వాపోయారు.