News November 2, 2024

అమరావతి రైల్వే ప్రాజెక్టు భూసేకరణకు నోటిఫికేషన్

image

అమరావతి రైల్వే ప్రాజెక్టు భూసేకరణకు రైల్వేశాఖ గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. TGలోని ఖమ్మం జిల్లా ఎర్రుపాలెం నుంచి అమరావతి మీదుగా నంబూరు మధ్య కొత్త బ్రాడ్‌గేజ్ లైన్‌ నిర్మించనున్నారు. ఇందులో భాగంగా ఎర్రుపాలెం, కేసిరెడ్డిపల్లి గ్రామాల్లో భూసేకరణకు సంబంధించి షెడ్యూల్ ఇచ్చింది. భూమిని స్వాధీనం చేసుకోవడం, ఉపయోగించడంపై అభ్యంతరాలు ఉన్నవారు ఖమ్మం స్పెషల్ డిప్యూటీ కలెక్టర్‌కు అభ్యంతరాలు తెలపాలంది.

Similar News

News December 13, 2024

ఈ నెల 16న క్యాబినెట్ భేటీ

image

TG: ఈ నెల 16న సీఎం రేవంత్ అధ్యక్షతన క్యాబినెట్ భేటీ జరుగనుంది. అసెంబ్లీలో కమిటీ హాల్‌లో జరిగే మంత్రివర్గ సమావేశంలో పలు చట్ట సవరణ బిల్లులకు క్యాబినెట్ ఆమోదం పలుకుతుందని తెలుస్తోంది.

News December 13, 2024

నేటి ‘గూగుల్’ డూడుల్ గమనించారా?

image

దేశం మొత్తం సెలబ్రేట్ చేసుకుంటున్న ‘వరల్డ్ చెస్ ఛాంపియన్షిప్’ విజయాన్ని ‘గూగుల్’ తనదైన శైలిలో జరుపుకుంది. తన డూడుల్‌ను చెస్ కాయిన్స్‌గా మార్చేసింది. ‘64 నలుపు & తెలుపు చతురస్రాల్లో ఇద్దరు ఆటగాళ్లు ఆడిన వ్యూహాత్మక గేమ్‌ను తలపించేలా డూడుల్‌ను రూపొందించాం’ అని గూగుల్ తెలిపింది. కాగా, నిన్న జరిగిన ఛాంపియన్షిప్‌లో భారత చెస్ ప్లేయర్ గుకేశ్ గెలుపొంది సత్తాచాటారు.

News December 13, 2024

OTTలోకి వచ్చేసిన ‘మెకానిక్ రాకీ’

image

విశ్వక్‌సేన్ హీరోగా నటించిన ‘మెకానిక్ రాకీ’ మూవీ ఓటీటీలోకి వచ్చేసింది. అమెజాన్ ప్రైమ్‌లో ఈ సినిమా స్ట్రీమింగ్ అవుతోంది. రవితేజ ముళ్లపూడి తెరకెక్కించిన ఈ మూవీలో మీనాక్షి చౌదరి, శ్రద్ధా శ్రీనాథ్ హీరోయిన్లుగా నటించారు. సునీల్, హైపర్ ఆది, నరేశ్ కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమా గత నెల 22న థియేటర్లలో విడుదలైంది. బాక్సాఫీస్ వద్ద అనుకున్నంతగా సక్సెస్ కాలేకపోయిందని సినీ వర్గాల విశ్లేషణ.