News September 29, 2024
త్వరలో 3 వేల ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్: మంత్రి
TGSRTCలో త్వరలోనే 3వేల ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ ఇవ్వనున్నట్లు మంత్రి పొన్నం <<14225767>>ప్రభాకర్ <<>>వెల్లడించారు. ఉద్యోగులకు PRC, కారుణ్య నియామకాలపై దృష్టి పెడతామని చెప్పారు. కాలుష్యాన్ని నివారించడంలో భాగంగా HYD రింగ్ రోడ్డు లోపల డీజిల్‌తో నడిచే బస్సు ఒక్కటి కూడా ఉండకుండా ప్రణాళికలు రచిస్తున్నామన్నారు. HYD సహా ఇతర జిల్లాల్లోనూ విద్యుత్ బస్సు సర్వీసులు నడపాలన్నదే తమ లక్ష్యమన్నారు.
Similar News
News October 11, 2024
ట్రంప్ ఎన్నికల ప్రకటనల్లో తెలుగు కూడా!
అమెరికా అధ్యక్ష బరిలో ఉన్న డొనాల్డ్ ట్రంప్ భారతీయుల్ని ఆకట్టుకునేందుకు అన్ని ప్రయత్నాలూ చేస్తున్నారు. ఇప్పటికే పలు ఇంటర్వ్యూల్లో భారత్‌పై ఆయన ప్రశంసలు కురిపించిన సంగతి తెలిసిందే. తాజాగా ఎన్నికల ప్రచార ప్రకటనల్ని కూడా భారతీయ భాషల్లోనే ఇస్తున్నారు. ముఖ్యంగా తమిళ, తెలుగు ప్రకటనలు చాలా చోట్ల దర్శనమిస్తున్నాయి. ‘సంస్కృతి-సన్మార్గం, దేశానికి ఆధారం. Vote Republican’ అంటూ పలు పోస్టర్లలో కనిపిస్తోంది.
News October 11, 2024
రాష్ట్రంలో ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల
TG: ఆరోగ్యశాఖలో మరో 371 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. 272 నర్సింగ్ ఆఫీసర్లు, 99 ఫార్మాసిస్ట్ పోస్టులకు మెడికల్ రిక్రూట్‌మెంట్ బోర్డు నోటిఫికేషన్ విడుదల చేసింది. కాగా గత నెలలో 2,050 స్టాఫ్ నర్స్ పోస్టులకు ప్రకటన రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. నర్సింగ్ పోస్టులకు అక్టోబర్ 14, ఫార్మాసిస్ట్ పోస్టులకు అక్టోబర్ 21 వరకు అప్లై చేసుకోవచ్చు. <
News October 11, 2024
ఎస్సీ వర్గీకరణపై ఏకసభ్య కమిషన్ ఏర్పాటు
TG: రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణపై ప్రభుత్వం ఏకసభ్య కమిషన్‌ను నియమించింది. హైకోర్టు రిటైర్డ్ జడ్జి జస్టిస్ షమీమ్ అక్తర్ నేతృత్వంలోని ఈ కమిషన్ ఎస్సీల్లోని ఉపవర్గాల వెనుకబాటుతనంపై అధ్యయనం చేయనుంది. 60 రోజుల్లో రిపోర్ట్ సమర్పించాలని ప్రభుత్వం ఆదేశించింది.