News November 2, 2024

నవంబర్ 2: చరిత్రలో ఈరోజు

image

✒ 1865: సాహితీవేత్త పానుగంటి లక్ష్మీ నరసింహారావు జననం
✒ 1950: ప్రఖ్యాత రచయిత జార్జి బెర్నార్డ్ షా మరణం
✒ 1962: సాహితీవేత్త త్రిపురనేని గోపీచంద్ మరణం
✒ 1965: బాలీవుడ్ నటుడు షారుఖ్ ఖాన్ జననం
✒ 2000: అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో వ్యోమగాముల నివాసం మొదలు
✒ 2012: కేంద్ర మాజీ మంత్రి కింజరాపు ఎర్రన్నాయుడు మరణం
✒ 2015: నటుడు కొండవలస లక్ష్మణరావు మరణం

Similar News

News October 27, 2025

తుఫాను తీరాన్ని తాకడం అంటే ఏంటి?

image

తుఫాను ఏర్పడినప్పుడు సముద్రంలోని సుడిగుండాల మధ్యలో ఉండే భాగాన్ని తుఫాను కన్ను (సైక్లోన్ ఐ) అంటారు. ఇది 50-60 కి.మీ పరిధిలో విస్తరించి ఖాళీగా ఉంటుంది. సైక్లోన్ ఐ తీరాన్ని (భూమిని) తాకితే <<18121128>>తుఫాను తీరాన్ని తాకిందని<<>> అర్థం. అది తీరాన్ని దాటే సమయంలో మేఘాలు చెల్లాచెదురై భారీ వర్షాలు కురుస్తాయి. వరదలు ముంచెత్తుతాయి. భీకర గాలులకు చెట్లు కూలిపోతాయి. సముద్రపు అలలు భూమిపైకి దూసుకొస్తాయి.

News October 27, 2025

తుఫాన్.. ఈ జిల్లాల్లో సెలవులు పొడిగింపు

image

AP: ‘మొంథా’ తుఫాన్ నేపథ్యంలో నెల్లూరు, చిత్తూరులో అధికారులు రేపు కూడా స్కూళ్లకు సెలవులు ప్రకటించారు. తీరం దాటే అవకాశం ఉన్న కాకినాడలో ఈ నెల 31 వరకు సెలవులు కొనసాగనున్నాయి. విశాఖ, కడప, ఏలూరు, ఉమ్మడి గోదావరిలో రేపు, కోనసీమ, కృష్ణా, NTR, గుంటూరు, అనకాపల్లి, విజయనగరం, మన్యం, అనకాపల్లి, బాపట్ల, అల్లూరిలో ఎల్లుండి వరకు హాలిడేస్ ప్రకటించారు. ఉమ్మడి కర్నూలు, అనంతపురంలో ఎలాంటి సెలవులు ఇవ్వలేదు.

News October 27, 2025

‘మనీవ్యూ’కు సైబర్ షాక్.. 3 గంటల్లో ₹49 కోట్లు కొల్లగొట్టారు

image

రుణాలిచ్చే మనీవ్యూ యాప్‌కు సైబర్ నేరగాళ్లు షాకిచ్చారు. యాప్ సిస్టమ్‌లోకి చొరబడి 3గంటల్లో ₹49 కోట్లు కొల్లగొట్టారు. 653 ఫేక్ అకౌంట్లకు డబ్బును బదిలీ చేసుకున్నారు. దుబాయ్, చైనా, హాంగ్‌కాంగ్, ఫిలిప్పీన్స్‌ నుంచి అంతర్జాతీయ ముఠా ఈ దాడి చేసిందని బెంగళూరు క్రైమ్ బ్రాంచ్ తెలిపింది. దుబాయ్‌లోని భారత సంతతి వ్యక్తి సూత్రధారి అని చెప్పింది. ఈ కేసులో పోలీసులు ఇద్దరిని అరెస్టు చేసి, ₹10 కోట్లు ఫ్రీజ్ చేశారు.