News November 2, 2024

నవంబర్ 2: చరిత్రలో ఈరోజు

image

✒ 1865: సాహితీవేత్త పానుగంటి లక్ష్మీ నరసింహారావు జననం
✒ 1950: ప్రఖ్యాత రచయిత జార్జి బెర్నార్డ్ షా మరణం
✒ 1962: సాహితీవేత్త త్రిపురనేని గోపీచంద్ మరణం
✒ 1965: బాలీవుడ్ నటుడు షారుఖ్ ఖాన్ జననం
✒ 2000: అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో వ్యోమగాముల నివాసం మొదలు
✒ 2012: కేంద్ర మాజీ మంత్రి కింజరాపు ఎర్రన్నాయుడు మరణం
✒ 2015: నటుడు కొండవలస లక్ష్మణరావు మరణం

Similar News

News December 5, 2024

రేషన్ బియ్యం అక్రమ రవాణాపై సీఐడీ విచారణ

image

AP: రేషన్ బియ్యంపై మంత్రి నాదెండ్ల మనోహర్ కీలక ప్రకటన చేశారు. రేషన్ బియ్యం అక్రమ రవాణాపై సీఐడీ విచారణకు ఆదేశించారు. ఆ బియ్యం ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఎవరు విదేశాలకు తరలిస్తున్నారనే అంశాలపై సీఐడీ విచారణ చేయనుంది.

News December 5, 2024

దివ్యాంగులకు ప్రభుత్వం గుడ్ న్యూస్

image

AP: రాష్ట్రంలోని దివ్యాంగులకు త్రీ వీలర్ వాహనాలు ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తోంది. రూ.లక్ష ఖరీదు చేసే వీటిని 100% సబ్సిడీతో అందించాలని నిర్ణయించింది. ఈ ఏడాది నియోజకవర్గానికి 10 చొప్పున అన్ని సెగ్మెంట్లకు కలిపి 1750 వాహనాలు ఇవ్వనుంది. నాలుగు నెలల్లో టెండర్లు నిర్వహించి లబ్ధిదారులకు వీటిని అందించనుంది. డిగ్రీ ఆపైన చదివిన వారికి, 70 శాతం కంటే ఎక్కువ వైకల్యం ఉన్న వారికి తొలి దశలో వీటిని ఇస్తారు.

News December 5, 2024

సౌదీలో పుష్ప-2 ‘జాతర’ సీక్వెన్స్ తొలగింపు!

image

పుష్ప-2 సినిమాకు సౌదీ అరేబియా సెన్సార్ బోర్డు షాకిచ్చింది. ఇందులోని 19 నిమిషాల జాతర ఎపిసోడ్‌ను తొలగించినట్లు నేషనల్ మీడియా వెల్లడించింది. బన్నీ అమ్మవారి గెటప్, హిందూ దేవతల గురించి ప్రస్తావించడంపై అభ్యంతరం వ్యక్తం చేసినట్లు తెలిపింది. దీంతో 3 గంటల ఒక నిమిషం వ్యవధితోనే చిత్రం అక్కడ ప్రదర్శితమవుతున్నట్లు పేర్కొంది. కాగా సింగమ్ అగైన్, భూల్ భులయ్య-3 చిత్రాలను ఆ దేశం బ్యాన్ చేసిన విషయం తెలిసిందే.