News November 21, 2024

నవంబర్ 21: చరిత్రలో ఈ రోజు

image

1947: స్వతంత్ర భారతదేశపు మొట్టమొదటి తపాలా బిళ్ల విడుదల
1970: శాస్త్రవేత్త, నోబెల్ బహుమతి గ్రహీత సి.వి.రామన్‌ మరణం (ఫొటోలో)
1987: నటి నేహా శర్మ జననం
2013: తెలుగు సినీ నిర్మాత వడ్డే రమేశ్ మరణం
☛ ప్రపంచ మత్స్య దినోత్సవం
☛ ప్రపంచ టెలివిజన్ దినోత్సవం

Similar News

News November 21, 2024

టెన్త్ విద్యార్థులకు శుభవార్త

image

AP: పదో తరగతి పరీక్షలను విద్యార్థులు తెలుగులోనూ రాసుకోవచ్చని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఆన్‌లైన్‌లో వివరాలు నమోదు చేసేటప్పుడు ఇంగ్లిష్/తెలుగు మీడియంను ఎంపిక చేసుకోవాలని, ఇప్పటికే దరఖాస్తులు సమర్పించిన వారు ఆప్షన్‌ను మార్చుకోవచ్చని తెలిపింది. ఈ ఒక్క ఏడాదికే ఇది వర్తించనుంది. 2020-21లో 1-6 తరగతులను ఇంగ్లిష్(M)లోకి మార్చిన ప్రభుత్వం, వారు టెన్త్‌కు వచ్చాక ENGలోనే పరీక్షలు రాయాలని రూల్ పెట్టింది.

News November 21, 2024

మీ ఇంట్లోకి టీవీ ఎప్పుడొచ్చింది?

image

ఓ పాతికేళ్లు వెనక్కి వెళ్తే.. అప్పట్లో ఊరికి ఒకట్రెండు ఇళ్లలోనే టీవీ ఉండేది. సాయంత్రం కాగానే టీవీ ఉన్న వాళ్ల ఇంటికి చూడటానికి వెళ్లేవారు. అప్పట్లో ఆ బ్లాక్&వైట్ టీవీ చూస్తేనే అదో పెద్ద గొప్ప. మిలీనియల్స్‌కి ఇది బాగా అనుభవం. ఆ తర్వాత కొన్నేళ్లకు క్రమంగా అందరూ టీవీలు కొనడం మొదలుపెట్టారు. ఇప్పుడు టీవీ లేని ఇల్లే లేదు. ఇంతకీ మీ ఇంట్లో టీవీ ఎప్పుడు కొన్నారు? కామెంట్ చేయండి.
> నేడు వరల్డ్ టెలివిజన్ డే

News November 21, 2024

లంగ్ క్యాన్సర్ స్కానింగ్ వైరల్.. ఎందుకంటే?

image

అతిగా సిగరెట్ తాగడంతో లంగ్ క్యాన్సర్‌కు గురైన ఓ వ్యక్తి స్కానింగ్ రిపోర్టు సోషల్ మీడియాలో వైరలవుతోంది. కొందరు వైద్యులు దీనిని షేర్ చేస్తున్నారు. స్కానింగ్‌లో గుండె, వెన్నుపూస, ఊపిరితిత్తులు పర్‌ఫెక్ట్‌గా కనిపించాయి. నల్ల బాణం గుర్తు ఉన్నది క్యాన్సర్. కుడివైపున అతని జేబులో దానికి కారణమైన సిగరెట్, లైటర్ ఉన్నాయి. కాగా సిగరెట్ తాగడం వల్ల వచ్చే క్యాన్సర్‌ను నయం చేయడం కష్టమని వైద్యులు హెచ్చరిస్తున్నారు.