News November 21, 2024
నవంబర్ 21: చరిత్రలో ఈ రోజు

1947: స్వతంత్ర భారతదేశపు మొట్టమొదటి తపాలా బిళ్ల విడుదల
1970: శాస్త్రవేత్త, నోబెల్ బహుమతి గ్రహీత సి.వి.రామన్ మరణం (ఫొటోలో)
1987: నటి నేహా శర్మ జననం
2013: తెలుగు సినీ నిర్మాత వడ్డే రమేశ్ మరణం
☛ ప్రపంచ మత్స్య దినోత్సవం
☛ ప్రపంచ టెలివిజన్ దినోత్సవం
Similar News
News April 18, 2026
ఎండాకాలంలో మీ ఫోన్ వేడెక్కుతోందా?

వేసవిలో తీవ్రమైన వేడి వల్ల స్మార్ట్‌ఫోన్లు త్వరగా వేడెక్కడమే కాకుండా వాటి పనితీరూ నెమ్మదిస్తోంది. ఓవర్ హీట్ వల్ల ఫోన్ హ్యాంగ్ అవడం, బ్యాటరీ దెబ్బతినడం వంటి సమస్యలొస్తుంటాయి. వీటిని నివారించేందుకు ఫోన్‌ను నేరుగా ఎండలో వాడకూడదని, బ్యాక్ కవర్ తీసేసి ఛార్జింగ్ పెట్టాలని నిపుణులు సూచిస్తున్నారు. బ్రైట్‌నెస్ తగ్గించడం, అవసరం లేనప్పుడు డేటా, బ్లూటూత్ ఆఫ్ చేస్తే బ్యాటరీ లైఫ్ కాపాడుకోవచ్చని చెబుతున్నారు.
News April 18, 2026
ఇవాళ ఈ జిల్లాల్లో వర్షాలు

తెలుగు రాష్ట్రాల్లోని పలు జిల్లాలకు ఇవాళ వర్ష సూచన ఉంది. ఏపీలోని విశాఖ, మన్యం, అల్లూరి, పోలవరం, ప.గో, ఏలూరు వర్షాలు కురుస్తాయని APSDMA తెలిపింది. తెలంగాణలోని రంగారెడ్డి, వికారాబాద్, సంగారెడ్డి, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి జిల్లాల్లో వానలు పడొచ్చని HYD వాతావరణ కేంద్రం పేర్కొంది. మరోవైపు ఏపీలోని 27 మండలాల్లో, TGలోని ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల జిల్లాల్లో వడగాలులు వీచనున్నాయి.
News April 18, 2026
కాళ్ల బేరానికొచ్చిన ట్రంప్?

ఇరాన్‌ను నాశనం చేసి హార్ముజ్‌ను స్వాధీనం చేసుకుంటామని ఇన్నాళ్లూ పెద్దపెద్ద ప్రకటనలు చేసిన ట్రంప్ ఇప్పుడు ఆ దేశంపై ప్రేమను ఒలకబోస్తున్నారు. హార్ముజ్‌ను ఓపెన్ చేశామని ప్రకటించడంతో ఏకంగా థాంక్స్ చెప్పారు. ఇరాన్ అందమైన దేశమంటూ కీర్తించారు. యుద్ధంలో గెలవడం చేతగాకే ట్రంప్ ఇలా మాట్లాడుతున్నారని పలువురు నెటిజన్లు ఎద్దేవా చేస్తున్నారు. ఇక ఇరాన్ యురేనియం ఇచ్చేస్తుందన్న ట్రంప్ <<19679151>>ప్రకటనా<<>> ఉత్తదే అని తేలింది.


