News November 29, 2024

నవంబర్ 29: చరిత్రలో ఈ రోజు

image

1759: ప్రముఖ గణిత శాస్త్రవేత్త నికోలస్ బెర్నోలీ మరణం
1877: తొలిసారిగా థామస్ ఆల్వా ఎడిసన్ ఫోనోగ్రాఫ్ ప్రదర్శన
1901: ప్రముఖ చిత్రకారుడు, పద్మశ్రీ గ్రహీత శోభా సింగ్ జననం
1982: నటి రమ్య జననం
1993: పారిశ్రామికవేత్త జె.ఆర్‌.డి.టాటా మరణం(ఫొటోలో)

Similar News

News December 8, 2024

12న ఏపీలో భారీ వర్షాలు

image

ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం రానున్న 24 గంటల్లో మరింత బలపడే అవకాశం ఉందని వాతావరణశాఖ తెలిపింది. ఇది 11న శ్రీలంక- తమిళనాడు మధ్య తీరం దాటొచ్చని అంచనా వేసింది. దీని ప్రభావంతో 12న ఏపీలోని దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని స్పష్టం చేసింది. నేడు అనకాపల్లి, విశాఖ, కాకినాడ, అల్లూరి సీతారామరాజు, పార్వతీపురం మన్యం, శ్రీకాకుళం జిల్లాల్లో వర్షాలు పడే అవకాశం ఉంది.

News December 8, 2024

యాదగిరిగుట్టకు రికార్డ్ స్థాయి ఆదాయం

image

TG: కార్తీకమాసంలో ఆర్జిత సేవలు, వీఐపీ బ్రేక్ దర్శనాలు, హుండీల ద్వారా యాదగిరిగుట్టకు రికార్డ్ స్థాయి ఆదాయం వచ్చింది. ఒక్క నెలలో రూ.18.03కోట్ల ఆదాయం సమకూరినట్లు ఆలయ ఈవో భాస్కర్ రావు తెలిపారు. గతేడాది ఇదే మాసంలో రూ.15.08 కోట్ల ఆదాయం వచ్చిందన్నారు. ఆలయం విమాన గోపురం బంగారు తాపడం కోసం రూ.25.52లక్షలు వచ్చినట్లు అధికారి వివరించారు.

News December 8, 2024

ఐటం సాంగ్స్‌కు శ్రీలీల నో?

image

‘కిస్సిక్’ సాంగ్‌తో మెరిసిన శ్రీలీల కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇకపై ఐటమ్ సాంగ్స్‌కు నో చెప్పాలని డిసైడ్ అయినట్లు సినీవర్గాలు చెబుతున్నాయి. చిరంజీవి ‘విశ్వంభర’లోనూ ఐటం సాంగ్ ఆఫర్ రాగా ఆమె తిరస్కరించినట్లు తెలుస్తోంది. పుష్ప-2కు ఉన్న క్రేజ్, పుష్పలో సమంత ఐటమ్ సాంగ్ హిట్ కావడంతో ‘కిస్సిక్’ సాంగ్‌కు ఒప్పుకున్నట్లు సమాచారం. అటు, ఈ నెల 25న ఆమె నటించిన ‘రాబిన్‌హుడ్‌’ విడుదల కానుంది.