News November 6, 2024

నవంబర్ 6: చరిత్రలో ఈరోజు

image

* పర్యావరణ దోపిడీని నిరోధించే దినోత్సవం
* 1940: గాయని, రచయిత రాజ్యలక్ష్మి జననం
* 1948: ఆధ్యాత్మికవేత్త ముంతాజ్ అలీ జననం
* 1962: సినీనటి అంబిక పుట్టినరోజు
* 1951: భారత మొదటి ప్రధాన న్యాయమూర్తి హీరాలాల్ జెకిసుందాస్ కనియా మరణం
* 1985: బాలీవుడ్ నటుడు సంజీవ్ కుమార్ మరణం(ఫొటోలో)

Similar News

News December 3, 2024

విపక్ష నేతగా ఏక్‌నాథ్ షిండే?

image

శివసేన పార్టీని ప్రతిపక్ష పార్టీగా ప్రకటించేందుకు బీజేపీ ప్లాన్ సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. ఉప ముఖ్యమంత్రి పదవిపై మాజీ సీఎం ఏక్‌నాథ్ షిండే ఆసక్తి చూపకపోవడంతో ఆయనను ప్రతిపక్షనేతగా నియమించనున్నట్లు సమాచారం. మహాయుతి ప్రభుత్వం ఎదుర్కొంటున్న విమర్శలను కొంతమేర తగ్గించేందుకే కమలనాథులు ఈ ప్లాన్ వేసినట్లు తెలుస్తోంది. కాగా ఇవాళ మహారాష్ట్ర సీఎంను ప్రకటించే అవకాశాలు ఉన్నాయి.

News December 3, 2024

వన్యప్రాణుల బోర్డు ఛైర్మన్‌గా సీఎం రేవంత్

image

TG: రాష్ట్రంలో వన్యప్రాణుల బోర్డుకు ప్రభుత్వం కొత్త సభ్యులను నియమించింది. ఈ బోర్డుకు సీఎం రేవంత్ ఛైర్మన్‌గా, అటవీశాఖ మంత్రి వైస్ ఛైర్‌పర్సన్‌గా ఉంటారు. అలాగే ఈ బోర్డులో మొత్తం 29 మంది సభ్యులు ఉన్నారు. ఇందులో ఎమ్మెల్యేలు, అధికారులు, పర్యావరణవేత్తలను బోర్డు నియమించింది. ఈ బోర్డులో ఎమ్మెల్యేలు భూక్యా మురళీ నాయక్, వంశీ కృష్ణ, పాయం వెంకటేశ్వర్లు, వెడ్మ బొజ్జు ఉన్నారు.

News December 3, 2024

నేడు క్యాబినెట్ భేటీ

image

AP: సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఇవాళ సచివాలయంలో మంత్రివర్గ సమావేశం జరగనుంది. ఈ భేటీలో పలు కీలక నిర్ణయాలు తీసుకునే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. కొత్త రేషన్ కార్డులు, అన్నదాత సుఖీభవ, తల్లికి వందనం, ఫీజు రీయింబర్స్‌మెంట్, రేషన్ స్మగ్లింగ్, పలు పెండింగ్ పనులపై చర్చిస్తారని సమాచారం. అలాగే వాలంటీర్ వ్యవస్థపై కూడా చర్చ జరిగే ఆస్కారం ఉందని తెలుస్తోంది.