News April 12, 2024
30 ఏళ్ల తర్వాత మళ్లీ ఇప్పుడే

కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్-2024 స్క్రీనింగ్ కాంపిటీషన్‌కు భారతీయ సినిమా ‘ఆల్ వి ఇమేజిన్ యాజ్ లైట్’ ఎంపికైంది. మే 14 నుంచి 25 వరకు ఈ ఫెస్టివల్ జరగనుండగా, పోటీలో ప్రదర్శించే సినిమాల పేర్లను నిర్వాహకులు ప్రకటించారు. భారత్ నుంచి 1994లో ‘స్వహం’ అనే మూవీ తొలిసారిగా ఈ ఫెస్టివల్ స్క్రీనింగ్‌కు ఎంపికైంది. ఆ తర్వాత మళ్లీ 30 ఏళ్లకు ఇప్పుడు పాయల్ కపాడియా తెరకెక్కించిన ‘ఆల్ వి ఇమేజిన్ యాజ్ లైట్’ సెలక్ట్ అయింది.
Similar News
News March 26, 2025
బైరెడ్డి సిద్ధార్థరెడ్డికి వైసీపీలో కీలక పదవి

AP: శాప్ మాజీ ఛైర్మన్ బైరెడ్డి సిద్ధార్థ రెడ్డికి వైసీపీ కీలక బాధ్యతలు అప్పగించింది. పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ ఆదేశాల మేరకు ఆయనను రాష్ట్ర యువజన విభాగ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా నియమించింది. అలాగే రాష్ట్ర ప్రచార విభాగ అధ్యక్షుడిగా కాకుమాను రాజశేఖర్‌ను నియమిస్తూ పార్టీ కేంద్ర కార్యాలయం ఓ ప్రకటన విడుదల చేసింది.
News March 26, 2025
IPLలో సరికొత్త చరిత్ర

IPL 2025 సరికొత్త జోష్‌తో కొనసాగుతోంది. ఇప్పటివరకు జరిగిన ఐదు మ్యాచుల్లో సగటున 3.9 బంతులకు ఫోర్, 9.9 బంతులకు సిక్సర్ నమోదైంది. ఐపీఎల్ ప్రారంభమైన తర్వాత ఈ స్థాయిలో దూకుడుగా ఆడటం ఇదే తొలిసారి. ఇక ఈ సీజన్లో ఇప్పటివరకు ఆడిన మ్యాచుల్లో కనీసం 20+ పరుగులు నమోదైన ఓవర్లు 20 ఉన్నాయి. ఇక ప్రారంభంలోనే SRH 286 పరుగులు చేసి 300 పరుగులు కొట్టేస్తామని ఇతర జట్లకు హెచ్చరికలు జారీ చేసింది.
News March 26, 2025
రేపటి నుంచి జాతీయ కరాటే ఛాంపియన్‌షిప్

TG: HYD గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో రేపటి నుంచి ఈ నెల 29 వరకు నాలుగో జాతీయ కరాటే ఛాంపియన్‌షిప్ జరగనుంది. సీనియర్, అండర్ 21, పారా కేటగిరీల్లో పోటీలను నిర్వహించనున్నారు. అన్ని రాష్ట్రాల నుంచి దాదాపు 1,500 మంది క్రీడాకారులు పాల్గొననున్నారు. రేపు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పోటీలను ప్రారంభిస్తారు. 29న ముగింపు వేడుకల్లో సీఎం రేవంత్ పాల్గొని బహుమతులు ప్రదానం చేస్తారు.