News August 23, 2024
అంబుజా సిమెంట్స్‌లో షేర్లు కొన్న NPS, SBI లైఫ్

అంబుజా సిమెంట్స్‌లో షేర్ల అమ్మకం ద్వారా అదానీ కుటుంబం రూ.4,251 కోట్లు సమీకరించిందని బ్యాంకింగ్ వర్గాలు తెలిపాయి. చివరి 5 సెషన్లలో రూ.20వేల కోట్ల విలువైన బ్లాక్ డీల్స్ జరిగినట్టు పేర్కొన్నాయి. GQG పాట్నర్స్ రూ.1679 కోట్లు, NPS రూ.525 కోట్లు, SBI లైఫ్ రూ.500 కోట్ల మేర షేర్లను కొన్నాయి. గ్రూపు కంపెనీల్లో 3% వాటా తగ్గించుకొని, ఆ డబ్బును ఇన్ఫ్రా రంగంలో పెట్టుబడి పెట్టాలని అదానీ కుటుంబం భావిస్తోంది.
Similar News
News January 14, 2026
ఈ నెల 19 నుంచి సర్పంచులకు ట్రైనింగ్

TG: రాష్ట్రంలో 12,728 పంచాయతీలకు గత నెలలో ఎన్నికలు జరిగిన విషయం తెలిసిందే. ఎన్నికైన సర్పంచులకు ఈ నెల 19 నుంచి వచ్చే నెల 28 వరకు ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ నిర్వహించనున్నట్లు తెలంగాణ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్‌మెంట్ ప్రకటించింది. జిల్లాలు, బ్యాచుల వారీగా 5 రోజులపాటు శిక్షణ కార్యక్రమాలు ఉండనున్నాయి. ఒక్కో బ్యాచులో 50 మంది ఉండనున్నారు.
News January 14, 2026
కేశాలకు కర్పూరం

కురులు అందంగా, ఆరోగ్యంగా ఉండాలంటే కర్పూరం నూనెను వాడాలంటున్నారు నిపుణులు. కర్పూరాన్ని మెత్తగా పొడి చేసుకొని నూనెలో వేసి 5నిమిషాలు మరిగించాలి. దీన్ని రాత్రి జుట్టు కుదుళ్లకు రాసి తర్వాత రోజు తలస్నానం చేయాలి. వారానికి రెండుసార్లు ఇలా చేస్తే.. చుండ్రు, జుట్టు పొడిబారడం, దురద వంటి సమస్యలు తగ్గుతాయి. అలాగే జుట్టు పెరుగుదలకు కూడా సహాయపడుతుంది. తెల్ల జుట్టును తగ్గించడంలోనూ కర్పూరం ఉపయోగపడుతుంది.
News January 14, 2026
సంక్రాంతిని ఎవరెలా చేస్తారంటే?

సంక్రాంతిని దేశవ్యాప్తంగా వివిధ పేర్లతో జరుపుకుంటారు. కేరళలో మకరజ్యోతి దర్శనం, తమిళనాడులో పొంగల్, పంజాబ్‌లో మాంగి, అస్సాంలో బిహుగా పిలుస్తారు. గుజరాత్‌లో సిదా పేరిట సోదరీమణులకు బహుమతులిస్తారు. UPలో కిచెరి, ఒడిశాలో మకర చౌలాగా ప్రసిద్ధి. తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి కోడి, పొట్టేళ్ల పందేలతో కోలాహలంగా ఉంటుంది. పేరు ఏదైనా ప్రకృతిని పూజించడం, దానాలు చేయడం, బంధువులతో కలిసి ఆనందాన్ని పంచుకోవడం కామన్.


