News September 21, 2024
NPS వాత్సల్య: తొలిరోజు ఎన్ని అకౌంట్లు తెరిచారంటే..
కేంద్ర ప్రభుత్వం సెప్టెంబర్ 18న ఆరంభించిన NPS వాత్సల్య స్కీమ్‌కు మంచి స్పందనే లభిస్తోంది. తొలిరోజే 9,705 మంది సబ్‌స్క్రైబ్ చేసుకున్నారు. ఇందులో 2,197 అకౌంట్లు e-NPS పోర్టల్ ద్వారా ఓపెన్ చేయడం విశేషం. ఈ అకౌంట్లను PFRDA పర్యవేక్షించే సంగతి తెలిసిందే. స్కీమ్ లాంచింగ్ ఈవెంట్ లైవ్ స్ట్రీమ్‌కు 15,723 వ్యూస్ వచ్చాయి. పిల్లల భవిష్యత్తు కోసం NPS తరహాలో ఇన్వెస్ట్ చేసేందుకు ఈ స్కీమ్ ఉపయోగపడుతుంది.
Similar News
News October 7, 2024
అమెరికాలో 227కు చేరిన హెలీన్ హరికేన్ మృతులు
అమెరికాలో హెలీన్ పెను తుఫాను గత నెలాఖరులో బీభత్సం సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ విపత్తులో ఇప్పటి వరకు ఆరు రాష్ట్రాల్లో కలిపి 227 మృతదేహాల్ని గుర్తించినట్లు అధికారులు తెలిపారు. కేటగిరీ-4 తీవ్రతతో విరుచుకుపడిన హెలీన్ తన దారిలో ఉన్న ప్రతి దాన్నీ ధ్వంసం చేసింది. 2005లో వచ్చిన కత్రీనా తుఫాను తర్వాత ఇదే అత్యంత తీవ్రమైనదని అధికారులు పేర్కొన్నారు. మృతుల సంఖ్య మరింత పెరగొచ్చని అంచనా వేశారు.
News October 7, 2024
రేపు తెలుగు రాష్ట్రాల సీఎంల భేటీ?
రేపు తెలుగు రాష్ట్రాల సీఎంలు చంద్రబాబు, రేవంత్ ఢిల్లీలో భేటీ అయ్యే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. అక్కడ జరిగే హోంమంత్రి సమావేశంలో వీరిద్దరూ పాల్గొంటారు. అనంతరం వీరిరువురూ భేటీ అవుతారని సమాచారం. ఇప్పటికే రేవంత్ ఢిల్లీ బయల్దేరి వెళ్లారు. చంద్రబాబు రేపు మధ్యాహ్నం హస్తినకు వెళ్తారు.
News October 7, 2024
భారత యువతిని పెళ్లాడనున్న పాక్ క్రికెటర్
పాకిస్థాన్ క్రికెటర్ హసన్ రజా భారత యువతి పూజను వివాహం చేసుకోనున్నారు. ఇటీవల న్యూయార్క్‌లో వీరి నిశ్చితార్థం జరగ్గా, ఇందుకు సంబంధించిన ఫొటోలు తాజాగా సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. పెళ్లికి ముందు పూజ ఇస్లాం మతాన్ని స్వీకరించనున్నట్లు రజా తెలిపారు. కాగా 32 ఏళ్ల హసన్ రజా పాక్ తరఫున ఒక వన్డే, 10 టీ20లు ఆడారు. అనంతరం ఆయన యూఎస్‌లో స్థిరపడ్డారు. పూజ ఫ్యామిలీ కూడా అక్కడే స్థిరపడింది.