News November 22, 2024

NRPT: ‘మిడ్‌డే మీల్స్ మెనూ అమలు కావడం లేదు’

image

నారాయణపేట జిల్లా పరిధిలోని ప్రభుత్వ పాఠశాలలో మిడ్‌డే మీల్స్ నిబంధనల ప్రకారం మెనూ ఎక్కడా అమలు కావడం లేదు. మెనూ అన్నం, మిక్స్ వెజిటేబుల్ కర్రీ, సాంబార్, గుడ్డు పెట్టాలి. కానీ ఎక్కడా అది అమలు కానీ పరిస్థితి నెలకొంది. వారంలో నాలుగు సార్లు మిడ్‌డే మీల్స్‌లో గుడ్డు ఇవ్వాలి. కానీ ఇది ఎక్కడా అమలు కావడం లేదు. గుడ్ల ధర పెరిగిన కారణంగా గిట్టుబాటు కావడం లేదని వంట ఏజెన్సీ వారు చెబుతున్నారు.

Similar News

News February 7, 2026

ఎన్నికల్లో పీవో, ఏపీవోల పాత్ర కీలకం: కలెక్టర్ విజయేంద్ర

image

ఈనెల 11న జరిగే మున్సిపల్ ఎన్నికలను పటిష్టంగా నిర్వహించాలని అధికారులను కలెక్టర్ విజయేంద్ర బోయి ఆదేశించారు. ఎన్నికల్లో పీవో, ఏపీవోల పాత్ర కీలకమని అన్నారు. పాలమూరు కార్పొరేషన్, దేవరకద్ర, భూత్పూర్ ఎన్నికల సిబ్బంది అప్రమత్తంగా ఉండాలన్నారు. సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలకు 36 మంది మైక్రో అబ్జర్వర్లను నియమించినట్లు తెలిపారు. విధి నిర్వహణలో ఎలాంటి పొరపాట్లు జరగకుండా పారదర్శకత పాటించాలని స్పష్టం చేశారు.

News February 6, 2026

పాలమూరు జిల్లాలో ఈనాటి ముఖ్య వార్తలు

image

✒ పరీక్షల షెడ్యూల్ విడుదల
✒ డిగ్రీ రీవాల్యుయేషన్ నోటిఫికేషన్ విడుదల
✒ పుట్ట గొడుగు తయారీలో ఉచిత శిక్షణ
✒ పాలమూరుకు సీఎం వలస వచ్చారు: డీకే అరుణ
✒ ఫైనల్‌కు చేరిన పాలమూరు జట్టు
✒ పాలమూరు మున్సిపల్‌లో త్రిముఖ పోరు
✒ ఎన్నికల తర్వాత జిల్లాను రద్దు చేస్తారు: రాజేందర్ రెడ్డి
✒ పాలమూరు: బాలికపై అత్యాచారం.. యువకుడి అరెస్ట్

News February 6, 2026

MBNR: రైతులు ALERT..యూరియా ఉంది!

image

మహబూబ్ నగర్ జిల్లాలో ఇప్పటివరకు 63,430 మంది రైతులు 25,675 యూరియా బస్తాలను బుక్ చేసుకొని కొనుగోలు చేయడం జరిగిందని జిల్లా వ్యవసాయ అధికారి వెంకటేష్ వెల్లడించారు. 11,892 యూరియా బస్తాలు ఇంకను రైతులకు బుక్ చేసుకోవడానికి వీలుగా అందుబాటులో ఉన్నాయని, రైతు తనకు అందుబాటులో ఉన్న మండలం, డీలర్‌ను ఎంచుకుని బుకింగ్ చేసుకోవాలని, రైతులు ఎలాంటి ఇబ్బందులు పడవలసిన అవసరం లేదన్నారు.