News March 6, 2025

NRPT: రెండో రోజు పరీక్షలకు 71 మంది గైర్హాజరు

image

నారాయణపేట జిల్లాలో రెండో రోజు గురువారం ఇంటర్ పరీక్షలకు 71 మంది గైర్హాజరు అయ్యారని DIEO సుదర్శన్ రావు తెలిపారు. మొత్తం 3,803 మంది విద్యార్థులకు గాను, 3,732 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారు. 71 మంది పరీక్షలకు హాజరు కాలేదని చెప్పారు. జిల్లాలోని పలు పరీక్ష కేంద్రాలను ఫ్లయింగ్, సిట్టింగ్ స్క్వాడ్ లు తనిఖీలు చేసినట్లు పేర్కొన్నారు.

Similar News

News March 6, 2025

విద్యకు దూరమైన బాలిక.. స్పందించిన సీఎం

image

TG: బర్త్ సర్టిఫికెట్, ఆధార్ లేదంటూ HYD సనత్‌నగర్‌కు చెందిన శ్రీవిద్య(8)ను స్కూలులో చేర్చుకోలేదన్న వార్తపై CM రేవంత్ స్పందించారు. ‘శ్రీవిద్య సమస్య నా దృష్టికి వచ్చింది. ఆమె పాఠశాలకు వెళ్లకపోవడానికి ఆధార్ లేకపోవడం కారణం కాదని విచారణలో తేలింది. కుటుంబ కారణాల వల్లే ఆమె స్కూలుకు దూరమైంది. అధికారులు ఆమెను తిరిగి స్కూలులో చేర్పించారు. తను మంచిగా చదివి భవిష్యత్తులో గొప్పగా రాణించాలి’ అని ట్వీట్ చేశారు.

News March 6, 2025

 టైమ్ లైన్ ప్రకారం పూర్తి చేయాలి: కలెక్టర్

image

శంకర్ విలాస్ ఫ్లై ఓవర్ బ్రిడ్జ్ పనులకు సంబంధించిన ల్యాండ్ అక్విజెషన్ పనులు టైమ్ లైన్ ప్రకారం పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ ఎస్.నాగలక్ష్మి అధికారులను ఆదేశించారు. బ్రిడ్జ్ నిర్మాణ పనులకు సంబంధించిన స్టేక్ హోల్డర్లతో గురువారం కలక్టరేట్లో సమావేశం నిర్వహించారు. ఆర్.అండ్.బి ఎస్.ఈ శ్రీనివాస మూర్తి మాట్లాడుతూ.. నిర్మాణానికి సంబంధించి టెండర్‌ను శుక్రవారం నాడు విడుదల చేయడం జరుగుతుందన్నారు.

News March 6, 2025

సిరిసిల్ల: ప్రమాదవశాత్తు బావిలో పడ్డ వ్యక్తి మృతి

image

ఇల్లంతకుంట మండలంలో ఓ వ్యక్తి ద్విచక్ర వాహనంపై వెళ్తూ ప్రమాదవశాత్తూ బావిలో పడి చనిపోయిన ఘటన గురువారం చేసుకుంది. స్థానికుల వివరాల ప్రకారం శీలం రజినీకాంత్(26) అనే వ్యక్తి ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా పెద్ద లింగాపూర్ గ్రామ శివారులో బావిలో పడి మృతి చెందాడు. స్థానిక సహాయంతో మృతదేహాన్ని బయటకు తీసి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

error: Content is protected !!