News March 24, 2025

NRPT: బెట్టింగ్‌లకు పాల్పడితే కఠిన చర్యలు

image

క్రికెట్ బెట్టింగులకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని నారాయణపేట జిల్లా ఎస్పీ యోగేష్ గౌతమ్ సోమవారం ఒక ప్రకటనలో హెచ్చరించారు. ప్రస్తుతం ఐపీఎల్ క్రికెట్ పోటీలు జరుగుతున్న నేపథ్యంలో ఎక్కడైనా బెట్టింగ్‌లకు పాల్పడుతున్నట్లు తెలిస్తే స్థానిక పోలీసులకు సమాచారం ఇవ్వాలని చెప్పారు. బెట్టింగులతో యువత జీవితాలు నాశనం చేసుకోవద్దని సూచించారు. బెట్టింగులపై ఎల్లప్పుడూ నిఘా ఉంచామని అన్నారు.

Similar News

News March 29, 2025

ఆందోళనల్లో పాల్గొన్న విదేశీ విద్యార్థుల వీసాలు క్యాన్సిల్!

image

అమెరికా యూనివర్సిటీల్లోని విదేశీ విద్యార్థులకు ట్రంప్ ప్రభుత్వం షాకిస్తోంది. యూనివర్సిటీల్లో జరిగిన వివిధ ఆందోళనల్లో క్రియాశీలకంగా వ్యవహరించిన వారికి వీసాలు రద్దు చేస్తున్నట్లు మెయిల్స్ పంపుతున్నారు. అక్కడి దృశ్యాలను, జాతి వ్యతిరేక సందేశాలను సోషల్ మీడియాలో షేర్ చేసిన, లైక్ చేసిన విద్యార్థులకూ ఈ హెచ్చరికలు పంపింది. ఇందులో పలువురు భారతీయ విద్యార్థులూ ఉన్నట్లు తెలుస్తోంది.

News March 29, 2025

బిక్కనూర్: బీడీ కార్మిక సంఘం అధ్యక్షుడి ఎన్నిక

image

రాష్ట్ర బీడీ కార్మిక సంఘం అధ్యక్షునిగా సందుగారి రవీందర్ రెడ్డి ఎన్నికయ్యారు. బిక్కనూర్ మండలం రామేశ్వర పల్లి గ్రామానికి చెందిన ఆయన బీఎంఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా గత 22 సంవత్సరాలుగా పని చేస్తున్నారు. సిరిసిల్ల పట్టణంలో జరిగిన రాష్ట్ర మహాసభల్లో ఆయనను రాష్ట్ర బీడీ కార్మిక సంఘం అధ్యక్షునిగా ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బీడీ కార్మికుల సమస్యలపై నిరంతర పోరాటం చేస్తానని పేర్కొన్నారు.

News March 29, 2025

విశాఖ: ఐపీఎల్ మ్యాచ్‌కు సర్వం సిద్ధం

image

విశాఖ పీఎంపాలెం ఏసీఏ-వీసీడిఏలో నిర్వహించనున్న ఐపీఎల్ మ్యాచ్‌కు సర్వం సిద్ధమైనట్లు శనివారం నిర్వాహకులు తెలిపారు. ఆదివారం కావడంతో అధికసంఖ్యలో ప్రేక్షకులు వస్తారన్న అభిప్రాయంతో పోలీసులు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. రేపు ఢిల్లీ కాపిటల్స్ వర్సెస్ సన్రైజర్స్ మధ్య జరగనున్న ఈ మ్యాచ్‌లో సన్ రైజర్స్ అభిమానులు ఎక్కువగా వచ్చే అవకాశాలు ఉన్నాయి. బ్లాక్ టికెట్ల కట్టడికి పోలీసులు నిఘా ఉంచినట్లు తెలిపారు.

error: Content is protected !!