News September 13, 2024

విజయవాడ రైల్వేస్టేషన్‌కు NSG-1 హోదా

image

AP:విజయవాడ రైల్వే‌స్టేషన్ అరుదైన గుర్తింపును దక్కించుకుంది. వార్షికాదాయం ₹500 కోట్లు అధిగమించి, NSG-1 హోదాను సాధించి దేశంలోని టాప్-28 స్టేషన్లలో ఒకటిగా నిలిచింది. SCR పరిధిలో సికింద్రాబాద్ తర్వాత ఈ హోదా సాధించిన స్టేషన్‌గా నిలిచింది. ఏటా ₹500cr కంటే ఎక్కువ ఆదాయం లేదా 2 కోట్ల మంది ప్రయాణించే స్టేషన్‌కు దక్కే ఈ హోదాను విజయవాడ గతంలో తృటిలో చేజార్చుకోగా, తాజాగా ₹528cr వార్షికాదాయం పొంది సాధించింది.

Similar News

News October 13, 2024

రూర్కీ సమీపంలో రైల్వే ట్రాక్‌పై గ్యాస్ సిలిండర్

image

ఉత్త‌రాఖండ్‌ రూర్కీ స‌మీపంలో రైల్వే ట్రాక్‌పై గుర్తు తెలియ‌ని దుండ‌గులు ఉంచిన‌ ఖాళీ గ్యాస్ సిలిండ‌ర్ క‌ల‌క‌లం రేపింది. ధంధేరా- లాండౌరా స్టేష‌న్ల మ‌ధ్య ఉద‌యం 6:35కి గూడ్స్ రైలు వెళ్తోంది. ఈ క్రమంలో ట్రాక్‌పై సిలిండర్‌ను గుర్తించిన లోకోపైల‌ట్ వెంటనే రైలును నిలిపివేశారు. ఘ‌ట‌నా స్థలానికి పాయింట్స్‌మెన్ చేరుకొని ఖాళీ సిలిండ‌ర్‌గా గుర్తించారు. ఆగ‌స్టు నుంచి దేశంలో ఇలాంటి 18 ఘ‌ట‌న‌లు చోటుచేసుకున్నాయి.

News October 13, 2024

పెళ్లిళ్లకు మంచి ముహూర్తాలివే..

image

తెలుగు రాష్ట్రాల్లో మళ్లీ పెళ్లి సందడి మొదలైంది. OCT, NOV, DECలో భారీగా వివాహాలు జరగనున్నాయి. ఈ 3 నెలల్లోని కొన్ని తేదీలను పండితులు పెళ్లి ముహూర్తాలుగా నిర్ణయించారు. ఇప్పటికే NOV, DECలో ముహూర్తాలు పెట్టగా, ఈనెలలోనూ నిన్నటి నుంచి పెళ్లిళ్లు మొదలయ్యాయి. OCTలో 13,16,20,27, NOVలో 3,7,8,9,10,13,14,16,17, DECలో 5,6,7,8,11,12, 14,15, 26 తేదీలు వివాహాలకు అనుకూలమైనవని పండితులు వెల్లడించారు.

News October 13, 2024

విమానాల్లో పేజర్లు, వాకీటాకీలపై ఇరాన్ నిషేధం

image

ప్రతీకార దాడులు తప్పవన్న ఇజ్రాయెల్ హెచ్చరికల నేపథ్యంలో ఇరాన్ జాగ్ర‌త్త‌ప‌డుతోంది. హెజ్బొల్లా పేజ‌ర్ల పేలుళ్ల త‌ర‌హా ఘ‌ట‌న‌ల‌కు ఆస్కారం ఇవ్వ‌కుండా ఇరాన్ విమాన‌యాన శాఖ వీటిపై నిషేధం విధించింది. ప్ర‌యాణికులు మొబైల్ ఫోన్లు మిన‌హా పేజ‌ర్లు, వాకీటాకీల‌ను విమాన క్యాబిన్‌లో, చెక్-ఇన్‌లో తీసుకెళ్ల‌లేరు. దుబాయ్ నుంచి వ‌చ్చి, వెళ్లే విమానాల్లో స‌హా దుబాయ్ మీదుగా వెళ్లే విమానాల్లో ఈ నిషేధాన్ని విధించారు.