News December 17, 2024
ఇకపై ప్రవేశ పరీక్షల నిర్వహణకే NTA: కేంద్ర మంత్రి

కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ కీలక ప్రకటన చేశారు. ఇకపై విద్యాసంస్థల్లో ప్రవేశాలకు మాత్రమే నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ పరీక్షలను నిర్వహిస్తుందని చెప్పారు. 2025 నుంచి ఎలాంటి రిక్రూట్‌మెంట్ పరీక్షలు నిర్వహించబోదని తెలిపారు. విద్యావ్యవస్థను సమర్థవంతంగా పనిచేసేలా తీసుకుంటున్న సంస్కరణల్లో ఇది భాగమని పేర్కొన్నారు. వచ్చే ఏడాది NTAను పునర్నిర్మిస్తామన్నారు.
Similar News
News November 15, 2025
తిప్పేస్తున్న జడేజా.. 6 వికెట్లు కోల్పోయిన సౌతాఫ్రికా

సౌతాఫ్రికాతో జరుగుతున్న తొలి టెస్టులో భారత్ పట్టుబిగిస్తోంది. రెండో ఇన్నింగ్సులో RSA 75 పరుగులకే 6 వికెట్లు కోల్పోయింది. స్టార్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా 4 వికెట్లతో సత్తా చాటారు. ప్రస్తుతం సౌతాఫ్రికా 45 పరుగుల లీడ్‌లో ఉంది. ఇవాళ మరో 17 ఓవర్ల ఆట మిగిలి ఉంది.
News November 15, 2025
రాజకీయాలు, కుటుంబానికి గుడ్‌బై: లాలూ కూతురు

బిహార్ మాజీ సీఎం, RJD పార్టీ ప్రెసిడెంట్ లాలూ ప్రసాద్ యాదవ్ కూతురు రోహిణి ఆచార్య సంచలన ప్రకటన చేశారు. తాను రాజకీయాలతో పాటు కుటుంబంతో బంధాన్ని తెంచుకుంటున్నట్లు సోషల్ మీడియాలో ప్రకటించారు. సంజయ్ యాదవ్, రమీజ్ పార్టీ నుంచి వెళ్లిపోమని తనతో చెప్పారని, మొత్తం నింద తానే తీసుకుంటున్నట్లు తెలిపారు. గతంలో రోహిణి తన తండ్రి లాలూకు కిడ్నీ దానం చేసిన విషయం తెలిసిందే.
News November 15, 2025
తండ్రయిన రాజ్‌కుమార్

బాలీవుడ్ స్టార్ కపుల్ రాజ్‌కుమార్ రావు-పత్రలేఖ తల్లిదండ్రులయ్యారు. ఇవాళ వారి నాలుగో వివాహ వార్షికోత్సవం రోజునే ఆడబిడ్డకు జన్మనిచ్చారు. ఈ విషయాన్ని వారు సోషల్ మీడియాలో వెల్లడించారు. దీంతో ఫ్యాన్స్, పలువురు నటీనటులు శుభాకాంక్షలు తెలిపారు. 2010లో బాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చిన రాజ్.. స్త్రీ2 చిత్రంతో ఇండస్ట్రీ హిట్ సాధించిన విషయం తెలిసిందే. పత్రలేఖ కూడా పలు చిత్రాల్లో హీరోయిన్‌గా నటించారు.


