News September 14, 2024
వరద బాధిత జిల్లాగా NTR
AP: NTR జిల్లాను పూర్తి వరద ప్రభావిత జిల్లాగా ప్రకటిస్తూ రెవెన్యూ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. AUG 30, 31 తేదీల్లో జిల్లాలో రికార్డు స్థాయిలో వర్షం కురవడంతో విజయవాడలోని 32 డివిజన్లు పూర్తిగా మునిగాయి. 2 లక్షల మంది బాధితులయ్యారు. బుడమేరు, కృష్ణా నది, మున్నేరు వరదల కారణంగా చాలా ప్రాంతాలు నష్టపోయాయి. దీంతో ఈ జిల్లాను వరద బాధిత జిల్లాగా ప్రకటించడంతో కేంద్రం నుంచి నిధులు ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది.
Similar News
News October 15, 2024
కొవిడ్ సోకిన పిల్లలకు డయాబెటిస్ ముప్పు అధికం: పరిశోధకులు
కొవిడ్ సోకిన పిల్లలు, యువతలో డయాబెటిస్ వచ్చే ముప్పు చాలా ఎక్కువగా ఉందని USలోని కేస్ వెస్టర్న్ రిజర్వ్ పరిశోధకులు చేసిన అధ్యయనంలో తేలింది. 2020 జనవరి-2022 డిసెంబరు మధ్యకాలంలోని వైద్య రికార్డులను వారు పరిశీలించారు. కొవిడ్ సోకిన పిల్లలకు, సాధారణ శ్వాసకోశ సమస్యలున్న పిల్లలకు మధ్య టైప్-2 డయాబెటిస్ వ్యత్యాసాన్ని గమనించగా.. కరోనా సోకిన వారిలో తర్వాతి 6 నెలల్లోనే డయాబెటిస్ వచ్చినట్లు గుర్తించారు.
News October 15, 2024
స్కిల్ డెవలప్‌మెంట్ స్కామ్ కేసులో కీలక పరిణామం
AP స్కిల్ డెవలప్‌మెంట్ స్కామ్ కేసులో ఈడీ దూకుడుగా వ్యవహరిస్తోంది. సీమెన్స్ సంస్థకు చెందిన రూ.23 కోట్ల విలువైన ఆస్తులను ఎటాచ్ చేసింది. నకిలీ బిల్లులతో కొనుగోళ్లు జరిపినట్లు, వ్యక్తిగత ఖాతాలకు ఈ సంస్థ నిధులు మళ్లించినట్లు ఈడీ గుర్తించింది. ఏపీ సీఐడీ కేసు ఆధారంగా ఈడీ దర్యాప్తు వేగవంతం చేసింది. ఇదే కేసులో గతేడాది చంద్రబాబు జైలుకెళ్లారు.
News October 15, 2024
Air India విమానానికి బాంబు బెదిరింపు.. కెనడాకు మళ్లింపు
ఢిల్లీ నుంచి చికాగో వెళ్తున్న Air India విమానానికి బాంబు బెదిరింపు కలకలం రేపింది. దీంతో విమానాన్ని అత్యవసరంగా కెనడాలోని ఇకలూయిట్ విమానాశ్రయానికి దారి మళ్లించారు. ఆన్‌లైన్ పోస్టు ద్వారా అందిన భద్రతా ముప్పు కారణంగా మార్గమధ్యలో ఉన్న AI127 విమానాన్ని మళ్లించినట్టు సంస్థ ప్రకటించింది. ఇటీవల నకిలీ బెదిరింపులు అధికమైనా బాధ్యతగల సంస్థగా వీటిని తీవ్రంగా పరిగణిస్తున్నట్టు తెలిపింది.