News July 30, 2024

‘హాయ్ నాన్న’ డైరెక్టర్‌తో ఎన్టీఆర్ మూవీ?.. 2026లో షూటింగ్!

image

‘హాయ్ నాన్న’ సినిమా డైరెక్టర్ శౌర్యువ్‌తో Jr.NTR సినిమా చేయనున్నట్లు బాలీవుడ్ మీడియా తెలిపింది. ఈ యాక్షన్ మూవీ రెండు పార్టులుగా రానుందని, 2026లో పార్ట్-1 షూటింగ్ జరగనున్నట్లు పేర్కొంది. స్టోరీ డిస్కషన్స్ ఇప్పటికే జరిగాయని, తారక్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. 2028లో పార్ట్-1, 2031లో పార్ట్-2 రిలీజ్‌కు మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లు హీరో సన్నిహిత వర్గాలు తెలిపాయని ‘పింక్ విల్లా’ పేర్కొంది.

Similar News

News October 12, 2024

TODAY HEADLINES

image

* AP: 1.21 కోట్ల కుటుంబాలకు ‘చంద్రన్న బీమా’
* AP: ముగిసిన వైన్ షాపుల దరఖాస్తు గడువు
* TG: కేసీఆర్ 5 వేల స్కూళ్లు మూసేశారు: సీఎం రేవంత్
* TG: తెలంగాణలో సమగ్ర కులగణన.. ఇంటింటి సర్వే
* పనిచేయని ఉద్యోగులపై వేటు: మోదీ
* టాటా ట్రస్టు ఛైర్మన్‌గా నోయల్ టాటా
* రాజకీయాల్లో చేరిన నటుడు షాయాజీ షిండే
* టీమ్ ఇండియా క్రికెటర్ సిరాజ్‌కు డీఎస్పీ పోస్ట్
* భారత జట్టు వైస్ కెప్టెన్‌గా బుమ్రా

News October 12, 2024

షాన్ మసూద్ కెప్టెన్సీకి గండం?

image

ఇంగ్లండ్‌తో జరిగిన టెస్ట్‌లో ఘోర ఓటమి పాక్ కెప్టెన్ షాన్ మూసూద్‌ కెరీర్‌పై నెగటివ్ ఇంపాక్ట్ చూపే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఆయన సారథ్యంలో ఆడిన ఆరు మ్యాచుల్లోనూ పాక్ ఓటమి పాలైంది. దీంతో మూసూద్‌ని కెప్టెన్సీ నుంచి తొలగిస్తారనే ప్రచారం సాగుతోంది. ఆయన స్థానంలో మహ్మద్ రిజ్వాన్, సల్మాన్ అలీ అఘా పేర్లు పరిశీలనలో ఉన్నట్లు తెలుస్తోంది. కాగా హోం పిచ్‌లో 2022 నుంచి పాక్ ఒక్క మ్యాచ్‌లోనూ నెగ్గలేదు.

News October 12, 2024

ఎవరెస్ట్‌పై వందేళ్ల నాటి కాలు

image

హిమాలయాల్లో వందేళ్ల తర్వాత ఓ పర్వతారోహకుడి కాలు బయటపడింది. 1924లో ఇంగ్లండ్‌కు చెందిన ఆండ్రూ కామ్న్ శాండీ ఇర్విన్ (22) మరో వ్యక్తితో కలిసి ఎవరెస్ట్ ఎక్కుతూ గల్లంతయ్యారు. ఎన్ని రోజులు వెతికినా వారి ఆచూకీ లభించలేదు. గత నెలలో సెంట్రల్ రోంగ్ బుక్ గ్లేసియర్ వద్ద కొందరు ఓ కాలును గుర్తించారు. సాక్సులపై ‘ఏసీ ఇర్విన్’ అని రాసి ఉంది. ఇర్విన్ మునిమనవరాలు డీఎన్ఏతో పోల్చి చూడగా అతడి కాలేనని తేలింది.