News February 8, 2025

VD12 టీజర్‌కు NTR, సూర్య వాయిస్ ఓవర్?

image

రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ హీరోగా గౌతమ్ తిన్ననూరి తెరకెక్కిస్తోన్న ‘VD12’ సినిమా టీజర్ ఈనెల 12న విడుదల కానుంది. అయితే, వివిధ భాషల్లో విడుదలవుతున్న ఈ టీజర్‌కు ఆయా ఇండస్ట్రీల స్టార్ హీరోలు వాయిస్ ఓవర్ ఇచ్చినట్లు సినీవర్గాల్లో చర్చ జరుగుతోంది. హిందీ టీజర్‌కు రణ్‌బీర్ కపూర్, తమిళంలో సూర్య, తెలుగుకు ఎన్టీఆర్ వాయిస్ ఓవర్ ఇచ్చినట్లు టాక్. దీనిపై త్వరలో అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది.

Similar News

News January 15, 2026

ఫ్లైట్ క్రాష్ కేసు.. AAIBకి FIP లీగల్ నోటీసులు

image

గతేడాది JUNEలో జరిగిన అహ్మదాబాద్ ఫ్లైట్ ప్రమాదంలో ఆ విమాన పైలట్ సుమిత్ సభర్వాల్ కూడా చనిపోయిన విషయం తెలిసిందే. ఈ కేసులో విచారణకు హాజరు కావాలని సుమిత్ మేనల్లుడు, కెప్టెన్ వరుణ్‌కు ఎయిర్‌క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో(AAIB) నోటీసులిచ్చింది. దీనిని పైలట్స్ ఫెడరేషన్(FIP) తప్పుపట్టింది. కేసుతో సంబంధం లేని వ్యక్తిని విచారణకు పిలిచారని, ఇది వేధింపులతో సమానం అంటూ AAIBకి లీగల్ నోటీసులు పంపింది.

News January 15, 2026

BMCలో బీజేపీదే హవా.. ఎగ్జిట్ పోల్స్ అంచనా

image

ముంబై మున్సిపల్ (BMC) ఎన్నికల్లో బీజేపీ నేతృత్వంలోని మహాయుతి కూటమి విజయం సాధిస్తుందని ఎగ్జిట్ పోల్స్ అంచనా వేశాయి. బీజేపీ, ఏక్‌నాథ్ షిండేకు చెందిన శివసేనకు 131-151 సీట్లు వస్తాయని యాక్సిస్ మై ఇండియా వెల్లడించింది. ఉద్ధవ్, రాజ్ ఠాక్రేల కూటమి 58-68, కాంగ్రెస్‌ 12-16 వార్డులు గెలుచుకుంటాయని పేర్కొంది. కాగా BMCలో మొత్తం 227 వార్డులకు ఇవాళ ఎన్నికలు జరగ్గా, రేపు ఫలితాలు రానున్నాయి.

News January 15, 2026

షుగర్ తగ్గాలా? తిన్న తర్వాత 10 నిమిషాలు ఇలా చేయండి!

image

బ్లడ్ షుగర్ లెవల్స్‌ను తగ్గించుకోవడానికి కఠినమైన డైట్లు, భారీ వ్యాయామాలు అవసరం లేదని AIIMSలో శిక్షణ పొందిన డాక్టర్ సౌరభ్ సేథి చెబుతున్నారు. భోజనం చేసిన తర్వాత కేవలం 10 ని.ల నడక మందులకన్నా బాగా పనిచేస్తుందని తెలిపారు. నడిచినప్పుడు రక్తంలోని గ్లూకోజ్‌ను కండరాలు ఇంధనంగా వాడుకుంటాయి. దీంతో తిన్న వెంటనే షుగర్ లెవెల్స్ సడన్‌గా పెరగవు. ఇన్సులిన్ సెన్సిటివిటీ పెరిగి కాలేయంలో కొవ్వు చేరకుండా ఉంటుంది.