News February 8, 2025

VD12 టీజర్‌కు NTR, సూర్య వాయిస్ ఓవర్?

image

రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ హీరోగా గౌతమ్ తిన్ననూరి తెరకెక్కిస్తోన్న ‘VD12’ సినిమా టీజర్ ఈనెల 12న విడుదల కానుంది. అయితే, వివిధ భాషల్లో విడుదలవుతున్న ఈ టీజర్‌కు ఆయా ఇండస్ట్రీల స్టార్ హీరోలు వాయిస్ ఓవర్ ఇచ్చినట్లు సినీవర్గాల్లో చర్చ జరుగుతోంది. హిందీ టీజర్‌కు రణ్‌బీర్ కపూర్, తమిళంలో సూర్య, తెలుగుకు ఎన్టీఆర్ వాయిస్ ఓవర్ ఇచ్చినట్లు టాక్. దీనిపై త్వరలో అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది.

Similar News

News March 20, 2025

శ్రీవారి సర్వదర్శనానికి 18 గంటల సమయం

image

AP: తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 18 గంటల సమయం పడుతోంది. మరోవైపు వైకుంఠం క్యూకాంప్లెక్స్‌లోని 31 కంపార్టుమెంట్లలో వేంకటేశ్వర స్వామి భక్తులు దర్శనానికి వేచి ఉన్నారు. నిన్న శ్రీవారిని 72,388 మంది దర్శించుకోగా.. 26,145 మంది తలనీలాలు సమర్పించారు. హుండీ ఆదాయం రూ.3.97 కోట్లు వచ్చినట్లు టీటీడీ వెల్లడించింది.

News March 20, 2025

రాష్ట్రంలో నేడు తేలికపాటి వర్షాలు

image

ఎండ వేడిమితో అల్లాడుతున్న తెలుగు రాష్ట్రాలకు వాతావరణ శాఖ గుడ్ న్యూస్ చెప్పింది. ఏపీలో ఇవాళ ఉత్తర కోస్తాలో తేలికపాటి వర్షాలు కురుస్తాయని వాతావరణ నిపుణులు తెలిపారు. 22, 23న రాష్ట్రంలోని పలుచోట్ల వర్షాలు కురిసే అవకాశముందన్నారు. తెలంగాణలో రేపటి నుంచి తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఈ క్రమంలో మూడు రోజుల పాటు ఉష్ణోగ్రతలు తగ్గుతాయని పేర్కొంది.

News March 20, 2025

గ్రోక్ బూతులు.. వివరణ కోరిన కేంద్రం

image

ప్రముఖ సోషల్ మీడియా ప్లాట్‌ఫాం ఎక్స్‌లో AI చాట్‌బాట్ (గ్రోక్) సృష్టిస్తున్న వివాదాస్పద ప్రతిస్పందనలపై భారత్ ఆందోళన వ్యక్తం చేసింది. ఇటీవల గ్రోక్ హిందీలో అభ్యంతకర రీతిలో బూతు రిప్లైలు ఇచ్చింది. దీంతో గ్రోక్ హిందీ యాస దుర్వినియోగంపై కేంద్రం స్పందించింది. గ్రోక్ ఉత్పత్తి చేసిన ఆన్సర్లు, చాట్‌బాట్‌కు శిక్షణ ఇవ్వడానికి ఉపయోగించిన డేటాకు సంబంధించి ఐటీ మంత్రిత్వ శాఖ ఆ సంస్థ నుంచి వివరణ కోరింది.

error: Content is protected !!