News November 24, 2024

ఎన్టీఆర్ ‘మన దేశం’కు 75 ఏళ్లు

image

ఎన్టీఆర్ సినీ జీవితం ప్రారంభమై 75 ఏళ్లు పూర్తయ్యాయి. 1949 నవంబర్ 24న ఆయన నటించిన తొలి చిత్రం ‘మనదేశం’ విడుదలైంది. ఈ సినిమా కోసం కొత్త ముఖాలను ఎంపిక చేసే క్రమంలో ఒడ్డు, పొడుగు, చక్కటి వాచకం, గంభీర స్వరం ఉన్న ఎన్టీఆర్‌ను దర్శకుడు ఎల్వీ ప్రసాద్ తీసుకున్నారు. ఇందులో NTR పోలీస్‌గా నటించారు. ఈ సినిమా తర్వాత ఆయన వెనుదిరిగి చూసుకోలేదు. సినిమాలు, స్టూడియోలు, రాజకీయాలతో తన జీవితమంతా బిజీబిజీగా గడిపారు.

Similar News

News December 13, 2024

అల్లు అర్జున్‌ అరెస్ట్‌పై కేటీఆర్ ఫైర్

image

జాతీయ అవార్డు గ్రహీత అల్లుఅర్జున్‌ను అరెస్ట్ చేయడం పాలకుల అభద్రతకు పరాకాష్ఠ అని కేటీఆర్ అన్నారు. ‘తొక్కిసలాట బాధితుల పట్ల నాకు పూర్తిగా సానుభూతి ఉంది. కానీ నిజంగా ఎవరు విఫలమయ్యారు? అల్లు అర్జున్‌ లాంటి వ్యక్తిని ఓ సాధారణ నేరస్థుడిగా భావించి ఇలా చేయొద్దు. ప్రభుత్వం ఇలా ప్రవర్తించడం సరికాదు. దీనిని తీవ్రంగా ఖండిస్తున్నా. హైడ్రా వల్ల చనిపోయినవారి కేసులో రేవంత్‌నూ అరెస్ట్ చేయాలి’ అని ట్వీట్ చేశారు.

News December 13, 2024

హైకోర్టులో అల్లు అర్జున్ ఎమర్జెన్సీ పిటిషన్

image

అల్లు అర్జున్ పిటిషన్‌ను అత్యవసరంగా విచారించాలని ఆయన లాయర్ నిరంజన్ రెడ్డి హైకోర్టును కోరారు. ఈనెల 11నే పిటిషన్ వేశామని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. క్వాష్ పిటిషన్ వేసినట్లు పోలీసులకు కూడా తెలిపినట్లు చెప్పారు. అయితే అత్యవసర పిటిషన్లు ఉ.10.30 గంటలకే జత చేయాలని, ఈ పిటిషన్‌ను సోమవారం విచారిస్తామని పేర్కొంది. అయితే అప్పటివరకు అర్జున్‌పై చర్యలు తీసుకోకుండా ఆదేశించాలని ఆయన లాయర్‌ కోరారు.

News December 13, 2024

భార్యకు ముద్దుపెట్టి బయల్దేరిన అల్లు అర్జున్

image

‘పుష్ప-2’ సినిమా విజయంతో సంతోషంతో ఉన్న అల్లు కుటుంబం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. పోలీసులు ఇంటికి వచ్చి బన్నీని అదుపులోకి తీసుకోవడంతో ఏం జరుగుతుందో తెలియక అయోమయానికి గురయ్యారు. వ్యక్తి మరణానికి కారణమైనందుకు ఆయనపై నాన్ బెయిలబుల్ కేసు నమోదవడంతో భార్య స్నేహారెడ్డి భయాందోళనకు లోనయ్యారు. దీంతో ఏం టెన్షన్ పడొద్దంటూ బన్నీ ఆమె బుగ్గపై ముద్దు పెట్టి పోలీసులతో వెళ్లిపోయారు.