News April 8, 2026
NZB: ఇంటర్ అడ్మిషన్ షెడ్యూల్ రాలేదు: DIEO

జిల్లాలో కొన్ని ప్రైవేట్ కళాశాలల యాజమాన్యాలు, అధ్యాపకులు 10వ తరగతి ఫలితాలు రాక ముందే ఇంటర్ అడ్మిషన్లను చేస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందని, ఇంకా ఇంటర్ బోర్డు అడ్మిషన్ షెడ్యూల్ విడుదల చేయలేదని DIEO రవికుమార్ వెల్లడించారు. ఇంటర్ బోర్డు ద్వారా కళాశాలల గుర్తింపు ప్రక్రియ ఇంకా పూర్తి కాలేదన్నారు. అనుమతి లేని కళాశాలలలో విద్యార్థులను చేర్చుకోవడానికి వచ్చే వారిని నమ్మవద్దన్నారు.
Similar News
News April 20, 2026
నిజామాబాద్: ప్రజావాణికి 91 దరఖాస్తులు

నిజామాబాద్ జిల్లా కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి వివిధ సమస్యలపై 91 ఫిర్యాదులు అందాయి. అదనపు కలెక్టర్ దిలీప్ కుమార్, సబ్ కలెక్టర్లు వికాస్ మహతో, అభిగ్యాన్ మాల్వియాలు ఫిర్యాదుదారుల నుంచి వినతులను స్వీకరించారు. అదనపు కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రజావాణి దరఖాస్తులకు ప్రాధాన్యతనిచ్చి, బాధితుల సమస్యలను సత్వరమే పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు.
News April 20, 2026
బినోలలో దొంగల బీభత్సం.. బంగారం అపహరణ

నవీపేట్ మండలం బినోలలో దొంగలు బీభత్సం సృష్టించారు. గ్రామానికి చెందిన నర్సమ్మ ఇంట్లో గుర్తు తెలియని వ్యక్తులు ఇంటి తాళాలు పగలగొట్టి సుమారు నాలుగు తులాల బంగారం అపహరించినట్లు ఎస్ఐ శ్రీకాంత్ తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకొని క్లూస్ టీమ్‌తో ఆధారాలు సేకరించారు. దొంగలను పట్టుకునేందుకు రెండు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసినట్లు ఎస్ఐ వెల్లడించారు.