News April 8, 2026

NZB: కాంగ్రెస్ నుంచి ముగ్గురి సస్పెన్షన్, బహిష్కరణ

image

పార్టీ క్రమశిక్షణను ఉల్లంఘించినందుకు NSUI రాష్ట్ర మాజీ ప్రధాన కార్యదర్శి వరదబట్టు వేణురాజ్, 48వ డివిజన్ మాజీ ప్రెసిడెంట్ పుండ్ర సాయి కుమార్, మాజీ NSUI జిల్లా నాయకులు నరేన్ దీప్‌లను కాంగ్రెస్ నుంచి సస్పెండ్ చేస్తూ బహిష్కరిస్తున్నట్లు DCC NZB కార్పొరేషన్ అధ్యక్షుడు బొబ్బిలి రామకృష్ణ బుధవారం ప్రకటించారు. DCC అధ్యక్షుడు, తదితర నాయకులతో ముగ్గురు వాగ్వాదానికి దిగి పార్టీ క్రమశిక్షణను ఉల్లంఘించారన్నారు.

Similar News

News April 20, 2026

నిజామాబాద్: ప్రజావాణికి 91 దరఖాస్తులు

image

నిజామాబాద్ జిల్లా కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి వివిధ సమస్యలపై 91 ఫిర్యాదులు అందాయి. అదనపు కలెక్టర్ దిలీప్ కుమార్, సబ్ కలెక్టర్లు వికాస్ మహతో, అభిగ్యాన్ మాల్వియాలు ఫిర్యాదుదారుల నుంచి వినతులను స్వీకరించారు. అదనపు కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రజావాణి దరఖాస్తులకు ప్రాధాన్యతనిచ్చి, బాధితుల సమస్యలను సత్వరమే పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు.

News April 20, 2026

బినోలలో దొంగల బీభత్సం.. బంగారం అపహరణ

image

నవీపేట్ మండలం బినోలలో దొంగలు బీభత్సం సృష్టించారు. గ్రామానికి చెందిన నర్సమ్మ ఇంట్లో గుర్తు తెలియని వ్యక్తులు ఇంటి తాళాలు పగలగొట్టి సుమారు నాలుగు తులాల బంగారం అపహరించినట్లు ఎస్ఐ శ్రీకాంత్ తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకొని క్లూస్ టీమ్‌తో ఆధారాలు సేకరించారు. దొంగలను పట్టుకునేందుకు రెండు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసినట్లు ఎస్ఐ వెల్లడించారు.