News February 5, 2026

NZB: పోస్టల్ బ్యాలెట్ సౌకర్యాన్ని వినియోగించుకోవాలి

image

ఎన్నికల విధుల్లో ఉన్న ఉద్యోగులు పోస్టల్ బ్యాలెట్ సౌకర్యాన్ని వినియోగించుకోవాలని NZB జిల్లా ఎన్నికల అధికారి ఇలా త్రిపాఠి సూచించారు. మున్సిపల్ ఎన్నికల నిర్వహణ విధుల్లో నిమగ్నం అయిన ఉద్యోగులు ఓటు హక్కును వినియోగించుకునేందుకు వీలుగా ఐడీఓసీ(కలెక్టరేట్), మున్సిపల్ కార్యాలయాల్లో ఓటర్ ఫెసిలిటేషన్ సెంటర్లను ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు.

Similar News

News April 20, 2026

నిజామాబాద్: ప్రజావాణికి 91 దరఖాస్తులు

image

నిజామాబాద్ జిల్లా కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి వివిధ సమస్యలపై 91 ఫిర్యాదులు అందాయి. అదనపు కలెక్టర్ దిలీప్ కుమార్, సబ్ కలెక్టర్లు వికాస్ మహతో, అభిగ్యాన్ మాల్వియాలు ఫిర్యాదుదారుల నుంచి వినతులను స్వీకరించారు. అదనపు కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రజావాణి దరఖాస్తులకు ప్రాధాన్యతనిచ్చి, బాధితుల సమస్యలను సత్వరమే పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు.

News April 20, 2026

బినోలలో దొంగల బీభత్సం.. బంగారం అపహరణ

image

నవీపేట్ మండలం బినోలలో దొంగలు బీభత్సం సృష్టించారు. గ్రామానికి చెందిన నర్సమ్మ ఇంట్లో గుర్తు తెలియని వ్యక్తులు ఇంటి తాళాలు పగలగొట్టి సుమారు నాలుగు తులాల బంగారం అపహరించినట్లు ఎస్ఐ శ్రీకాంత్ తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకొని క్లూస్ టీమ్‌తో ఆధారాలు సేకరించారు. దొంగలను పట్టుకునేందుకు రెండు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసినట్లు ఎస్ఐ వెల్లడించారు.