News February 8, 2025
NZB: యువకుడి ప్రాణం తీసిన ఇన్‌స్టాగ్రామ్ గొడవ
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1738976070083_718-normal-WIFI.webp)
ముగ్గురు స్నేహితుల మధ్య జరిగిన గొడవ కారణంగా యువకుడు పురుగు మందు తాగి ఆత్మహత్యకు యత్నించగా చికిత్సపొందుతూ మృతిచెందాడు. ఈ ఘటన నిజామాబాద్ జిల్లా మోపాల్‌లో చోటుచేసుకుంది. ఎస్ఐ యాదగిరి గౌడ్ తెలిపిన వివరాలు.. కంజర గ్రామానికి చెందిన విశాల్(19) మరో ఇద్దరు స్నేహితుల మధ్య ఇన్‌స్టాగ్రామ్ విషయంలో గొడవ జరిగింది. దీంతో విశాల్ గత నెల 16న పురుగు మందు తాగాడు. చికిత్స పొందుతూ శుక్రవారం మృతిచెందాడు.
Similar News
News February 8, 2025
ముస్లింల ప్రాంతంలో ఆప్ ముందంజ
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1738984234790_782-normal-WIFI.webp)
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్‌లో ముస్లింలు ఎక్కువగా ఉన్న చోట్ల ఆప్ ఆధిపత్యం కనబరుస్తోంది. ఆయా ప్రాంతాల్లోని 10 స్థానాల్లో ఆ పార్టీ అభ్యర్థులు లీడింగ్‌లో ఉన్నారు. దీంతో ముస్లిం ప్రాంతాలల్లో ఆప్ పట్టు నిలుపుకుంటున్నట్లు తెలుస్తోంది. ఇక ఓవరాల్‌గా బీజేపీ 30 చోట్ల, ఆప్ 24 స్థానాల్లో, కాంగ్రెస్ ఒక చోట లీడింగ్‌లో ఉంది.
News February 8, 2025
HYD: ఆలుమొగల పంచాయితీలకు కారణాలు అవే..!
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1738984523322_1212-normal-WIFI.webp)
HYDలో ఆలుమొగల మధ్య గొడవలు కుటుంబాలలో చిచ్చురేపి, ప్రాణాలు తీస్తున్నాయి. నిత్యం సగటున ఒక్కో PSకు 15 నుంచి 20 వరకు దంపతుల తగాదాల ఫిర్యాదులు వస్తున్నాయి. మానసిక క్షోభ, ఆవేదన, అక్రమ సంబంధాలు, అనుమానం, క్షణికావేశంతో విచక్షణ కోల్పోతున్నారు. 3 కమిషనరేట్ల పరిధిలో ఒక్క ఏడాదిలో దాదాపు 40 మంది గృహిణులు ఆత్మహత్యకు గురయ్యారు, 54 మంది ఆత్మహత్యకు పాల్పడ్డట్లు రిపోర్టు చెబుతోంది.
News February 8, 2025
1956-93 మధ్య ఢిల్లీ అసెంబ్లీ ఎందుకు లేదు?
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1738981085860_695-normal-WIFI.webp)
1952లో ఢిల్లీకి తొలి ఎన్నికలు జరిగాయి. 1956 నుంచి 93 వరకు అసెంబ్లీ మనుగడలో లేదు. 1956 NOV 1న అమల్లోకి వచ్చిన రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ చట్టం ప్రకారం ఢిల్లీ రాష్ట్ర హోదా కోల్పోయి UTగా మారింది. ఆ తర్వాత ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ చట్టం వచ్చింది. 56 ఎలెక్టెడ్, LG నామినేటెడ్ మెంబర్స్ ఐదుగురు ఉండేవారు. అయితే వీరికి శాసనాధికారాలు లేవు. 1991లో 69వ సవరణ ద్వారా అసెంబ్లీ మళ్లీ మనుగడలోకి వచ్చింది.