News February 10, 2026
NZB: 220 పోలింగ్ స్టేషన్లు.. 4,94,954 మంది ఓట్లర్లు

మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో పటిష్టమైన బందోబస్తు ఏర్పాట్లు చేసినట్లు సీపీ సాయి చైతన్య తెలిపారు. నిజామాబాద్ కార్పొరేషన్, బోధన్, ఆర్మూర్, భీమ్‌గల్ మున్సిపాలిటీల్లో 220 పోలింగ్ స్టేషన్లలో 4,94,954 మంది ఓటు హక్కు వినియోగించుకొనున్నట్లు చెప్పారు. 3 బెటాలియన్ల TSSP, స్ట్రైకింగ్, స్పెషల్ స్ట్రైకింగ్ ఫోర్సుల ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. 10 ఎఫ్ఎస్టీ, 12 ఎస్ఎస్టీ టీమ్స్ అందుబాటులో ఉంటాయన్నారు.
Similar News
News April 20, 2026
నిజామాబాద్: ప్రజావాణికి 91 దరఖాస్తులు

నిజామాబాద్ జిల్లా కలెక్టరేట్లో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి వివిధ సమస్యలపై 91 ఫిర్యాదులు అందాయి. అదనపు కలెక్టర్ దిలీప్ కుమార్, సబ్ కలెక్టర్లు వికాస్ మహతో, అభిగ్యాన్ మాల్వియాలు ఫిర్యాదుదారుల నుంచి వినతులను స్వీకరించారు. అదనపు కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రజావాణి దరఖాస్తులకు ప్రాధాన్యతనిచ్చి, బాధితుల సమస్యలను సత్వరమే పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు.
News April 20, 2026
బినోలలో దొంగల బీభత్సం.. బంగారం అపహరణ

నవీపేట్ మండలం బినోలలో దొంగలు బీభత్సం సృష్టించారు. గ్రామానికి చెందిన నర్సమ్మ ఇంట్లో గుర్తు తెలియని వ్యక్తులు ఇంటి తాళాలు పగలగొట్టి సుమారు నాలుగు తులాల బంగారం అపహరించినట్లు ఎస్ఐ శ్రీకాంత్ తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకొని క్లూస్ టీమ్‌తో ఆధారాలు సేకరించారు. దొంగలను పట్టుకునేందుకు రెండు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసినట్లు ఎస్ఐ వెల్లడించారు.