News October 13, 2024

అక్టోబర్ 13: చరిత్రలో ఈ రోజు

image

1679: పెను తుపానుతో మచిలీపట్నం ప్రాంతంలో 20 వేల మందికి పైగా మృతి
1965: హాస్య నటి కల్పనా రంజనీ జననం
1973: కవి, గీత రచయిత కందికొండ యాదగిరి జననం
1987: బాలీవుడ్ నటుడు కిషోర్ కుమార్ మరణం
1990: హీరోయిన్ పూజా హెగ్డే జననం
1993: టీమ్ ఇండియా క్రికెటర్ హనుమ విహారి జననం
ప్రకృతి వైపరీత్యాల నిరోధక దినోత్సవం

Similar News

News November 3, 2024

పుట్టినరోజు శుభాకాంక్షలు

image

ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.

News November 3, 2024

భారత్‌ను సైబర్ ముప్పు దేశాల జాబితాలో చేర్చిన కెనడా.. ఖండించిన కేంద్రం

image

కెన‌డా మ‌రోసారి క‌వ్వింపు చ‌ర్య‌ల‌కు దిగింది. తాజాగా భార‌త్‌ను సైబ‌ర్ ముప్పు దేశాల జాబితాలో చేర్చింది. కెనడాలో సైబ‌ర్ నేరాల‌కు భార‌త్ ప్ర‌య‌త్నిస్తోంద‌ని, భారత ప్రభుత్వ ప్రాయోజిత సైబర్ నేరగాళ్లు గూఢచర్యం కోసం కెనడా ప్రభుత్వ నెట్‌వర్క్‌లపై దాడికి పాల్పడవచ్చని భావిస్తున్నట్టు పేర్కొంది. అయితే ఈ ఆరోప‌ణ‌ల‌ను భార‌త్ ఖండించింది. ఇది భారత్‌పై దాడికి కెన‌డా అనుసరిస్తున్న మ‌రో వ్యూహంగా అభివ‌ర్ణించింది.

News November 3, 2024

పంత్ ఢిల్లీని అందుకే వదిలేశాడా?

image

టీమ్ ఇండియా స్టార్ క్రికెటర్ రిషభ్ పంత్ ఢిల్లీని వీడేందుకు బలమైన కారణాలు ఉన్నట్లు తెలుస్తోంది. కోచ్‌గా పాంటింగ్, డైరెక్టర్‌గా గంగూలీని తప్పించడంతో ఆయన అసంతృప్తితో ఉన్నట్లు సమాచారం. అలాగే హేమాంగ్ బదానీని హెడ్ కోచ్‌గా, వేణుగోపాల్ రావును డైరెక్టర్‌గా నియమించడమూ ఇష్టం లేదట. అలాగే GMR ఆధ్వర్యంలో ఆయన ఆడేందుకు సిద్ధంగా లేడని తెలుస్తోంది. JSW ఆధ్వర్యంలోనే ఆయన ఆడాలని అనుకున్నట్లు వార్తలు వచ్చాయి.