News October 28, 2024

అక్టోబర్ 28: చరిత్రలో ఈరోజు

image

✒ 1867: స్వామి వివేకానంద బోధనలకు ప్రభావితమై హిందూమతాన్ని స్వీకరించిన మొదటి విదేశీ మహిళ సిస్టర్ నివేదిత జననం
✒ 1886: అమెరికాలో స్టాట్యూ ఆఫ్ లిబర్టీ విగ్రహావిష్కరణ
✒ 1900: జర్మనీ భాషావేత్త మాక్స్ ముల్లర్ మరణం
✒ 1909: రచయిత కొడవటిగంటి కుటుంబరావు జననం
✒ 1918: స్వతంత్ర దేశంగా చెకోస్లోవేకియా ఆవిర్భావం
✒ 1924: తెలుగు సినీనటి సూర్యకాంతం జననం

Similar News

News July 11, 2025

మీ పిల్లలూ స్కూల్‌కి ఇలాగే వెళుతున్నారా?

image

పిల్లలను స్కూళ్లకు పంపేందుకు పేరెంట్స్ ప్రైవేట్ వాహనాలను ఆశ్రయిస్తున్నారు. ఇదే అదనుగా డబ్బులకు ఆశపడి వాహనదారులు లెక్కకుమించి విద్యార్థులను ఎక్కిస్తున్నారు. దీంతో పిల్లల ప్రయాణం ప్రమాదకరంగా సాగుతోంది. రవాణాశాఖ అధికారులు ఇలాంటి వాహనాలపై దృష్టి పెట్టాలని పలువురు కోరుతున్నారు. ఏదైనా ప్రమాదం జరిగితే బాధ్యులు ఎవరని ప్రశ్నిస్తున్నారు. ఈ విషయాల్లో తల్లిదండ్రులు జాగ్రత్తగా వ్యవహరించాలని సూచిస్తున్నారు.

News July 11, 2025

బిజినెస్ అప్‌డేట్స్

image

*హిందుస్థాన్ యునిలీవర్ లిమిటెడ్ (HUL) కొత్త సీఈవో, ఎండీగా ప్రియా నాయర్ నియామకం
*LICలో మరోసారి వాటాలు విక్రయించేందుకు కేంద్రం ప్రయత్నాలు
*వేతనాల పెంపుపై నిర్ణయం తీసుకోలేదన్న TCS
*కెనడా దిగుమతులపై 35 శాతం టారిఫ్స్ విధించిన ట్రంప్, ఆగస్టు 1 నుంచి అమలు

News July 11, 2025

రూ.180 కోట్ల చెల్లింపునకు కేంద్రం గ్రీన్ సిగ్నల్

image

AP: 2014-19 మధ్య జరిగిన ఉపాధిహామీ పనుల బిల్లులు ఇచ్చేందుకు కేంద్రం అంగీకారం తెలిపింది. 2019లో వైసీపీ ప్రభుత్వం ఏర్పడ్డాక పేమెంట్లు ఇవ్వలేదని, ఐదేళ్ల పాటు సమాచారం ఇవ్వకపోవడంతో కేంద్రం ఆ ఫైళ్లను మూసివేసిందని రాష్ట్ర ప్రభుత్వం పేర్కొంది. తాము పదేపదే విజ్ఞప్తులు చేయడంతో రూ.180 కోట్ల విలువైన 3.5 లక్షల ఉపాధి హామీ పనులను కేంద్రం రీస్టార్ట్ చేస్తూ బిల్లులు చెల్లించేందుకు అంగీకరించిందని వివరించింది.