News October 4, 2024
అక్టోబర్ 4: చరిత్రలో ఈరోజు
1911: సినీ దర్శకుడు కమలాకర కామేశ్వరరావు జననం
1957: మొట్టమొదటి కృత్రిమ ఉపగ్రహం స్పుత్నిక్-1ను ప్రయోగించిన సోవియట్ యూనియన్
1977: నటి సంఘవి జననం
1997: క్రికెటర్ రిషబ్ పంత్ జననం
2015: సినీ నిర్మాత ఏడిద నాగేశ్వరరావు మరణం
* అంతర్జాతీయ జంతు దినోత్సవం
Similar News
News November 12, 2024
Stock Market: మళ్లీ భారీ నష్టాలు
దేశీయ స్టాక్ మార్కెట్లు వరుస నష్టాలు చవిచూస్తున్నాయి. మంగళవారం సెన్సెక్స్ 820 పాయింట్లు నష్టపోయి 78,675 వద్ద, నిఫ్టీ 257 పాయింట్లు కోల్పోయి 23,883 వద్ద స్థిరపడ్డాయి. రెండు బెంచ్ మార్క్ సూచీల్లో Lower Lows మినహా ఏకమైనా అప్ ట్రెండ్ ప్యాటర్న్ దర్శనమివ్వలేదు. 23,900 పరిధిలో నిఫ్టీకి, 78,800 పరిధిలోని సెన్సెక్స్‌కి కొంత సపోర్ట్ లభించినా చివరికి ఆ స్థాయులు కూడా Break Down అయ్యాయి.
News November 12, 2024
దక్షిణాఫ్రికాలో ఛాంపియన్స్ ట్రోఫీ?
పాకిస్థాన్‌లో జరగాల్సిన <<14588299>>ఛాంపియన్స్ ట్రోఫీ<<>> దక్షిణాఫ్రికాకు తరలివెళ్లే అవకాశాలు కనిపిస్తున్నాయి. పాక్‌కు వెళ్లేందుకు భారత్ సుముఖంగా లేకపోవడం, హైబ్రిడ్ మోడల్‌లో టోర్నీని నిర్వహించేందుకు PCB ఒప్పుకోకపోవడంతో SAలో ఈ టోర్నీని నిర్వహించాలని ఐసీసీ భావిస్తున్నట్లు సమాచారం. పాక్ క్రికెట్ బోర్డు అధికారికంగా తమ తుది నిర్ణయాన్ని ప్రకటించిన తర్వాత దీనిపై స్పష్టత వచ్చే అవకాశముందని క్రీడా వర్గాలు పేర్కొంటున్నాయి.
News November 12, 2024
విజన్-2047 కోసం సలహాలివ్వండి: చంద్రబాబు
AP: బడ్జెట్ సమావేశాలపై MLAలు అవగాహన పెంచుకోవాలని CM చంద్రబాబు సూచించారు. అసెంబ్లీలో స్పీకర్ అయ్యన్నపాత్రుడు అధ్యక్షతన MLAలు, MLCలతో వర్క్‌షాపులో CM మాట్లాడారు. ‘ప్రభుత్వం తెచ్చే బిల్లులు, పాలసీలపై అధ్యయనం చేయాలి. ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకోవాలి. MLAలు నిరంతరం సబ్జెక్ట్ నేర్చుకోవాలి. తెలుసుకోవాలి. సభలో ప్రతిపక్షం లేకపోయినా ప్రజలకు జవాబుదారీగా పనిచేద్దాం. విజన్2047పై సలహాలు ఇవ్వాలి’ అని CM కోరారు.