News October 8, 2025
అక్టోబర్ 8: చరిత్రలో ఈరోజు

1895: రచయిత అడివి బాపిరాజు జననం
1932: సినీ రచయిత శివ శక్తి దత్త జననం
1935: నటుడు మందాడి ప్రభాకర రెడ్డి జననం
1963: తెలుగు సినిమా నటుడు సీఎస్ఆర్ ఆంజనేయులు మరణం
1970: సినీ నటుడు, నిర్మాత నెల్లూరు కాంతారావు మరణం
1974: సినీ దర్శకుడు బి.ఆర్.పంతులు మరణం
* భారత వైమానిక దళ దినోత్సవం
Similar News
News October 8, 2025
2050 నాటికి అతిపెద్ద చమురు వినియోగదారుగా భారత్: బ్రిటన్ ఎకనామిస్ట్

చమురు వినియోగంలో 2050 నాటికి భారత్ అన్ని దేశాలను అధిగమిస్తుందని బ్రిటిష్ ఎకనామిస్ట్ స్పెన్సర్ డేల్ అంచనా వేశారు. ఇది ప్రపంచ ఇంధన వినియోగంలో 12%కి పైగా ఉంటుందన్నారు. ప్రస్తుతం ఇండియన్ ఆయిల్ డిమాండ్ రోజుకు 5.4M బారెల్స్‌గా ఉండగా, 2050 నాటికి ఇది 9.1M bpdకి చేరుతుందన్నారు. అలాగే నేచురల్ గ్యాస్ వినియోగం రెట్టింపవుతుందన్నారు. కాగా ప్రస్తుతం IND మూడో అతిపెద్ద చమురు దిగుమతిదారుగా, వినియోగదారుగా ఉంది.
News October 8, 2025
TGSRTCలో జాబ్స్.. నేటి నుంచి దరఖాస్తులు

TGSRTCలో 1,743 ఉద్యోగాల భర్తీకి నేడు దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం కానుంది. ఈ నెల 28 వరకు అప్లై చేసుకోవచ్చు. ఇందులో 1,000 డ్రైవర్, 743 శ్రామిక్ పోస్టులు ఉన్నాయి. డ్రైవర్ పోస్టులకు 22-35 ఏళ్లు, శ్రామిక్ ఉద్యోగాలకు 18-30 ఏళ్ల వయసున్న వారు అర్హులు. SC, ST, BC, EWS కేటగిరీ అభ్యర్థులకు 5 ఏళ్ల సడలింపు ఉంది. పూర్తి వివరాలకు, దరఖాస్తు చేసేందుకు <
News October 8, 2025
కోల్డ్రిఫ్ సిరప్‌కు 20 మంది పిల్లలు బలి!

మధ్యప్రదేశ్‌లో కోల్డ్రిఫ్ కాఫ్ సిరప్ మరణాల సంఖ్య 20కి చేరినట్లు Dy.CM రాజేంద్ర శుక్ల వెల్లడించారు. నాగ్‌పూర్‌లో ఆస్పత్రులను ఆయన సందర్శించారు. కలుషిత సిరప్ తాగి మరో ఐదుగురి కిడ్నీలు పాడైపోయాయని, ప్రస్తుతం చికిత్స అందిస్తున్నట్లు తెలిపారు. మృతుల్లో చింద్వారాకు చెందిన వారే 17 మంది ఉన్నారని చెప్పారు. ఫీవర్, జలుబు ఉన్న పిల్లలు సిరప్ తాగడంతో వాంతులు, మూత్ర విసర్జన సమస్యలు వంటి లక్షణాలు కనిపించాయన్నారు.