News March 16, 2024

ఒడిశా, అరుణాచల్, సిక్కిం 2019 రిజల్ట్స్

image

✒ ఒడిశా: అసెంబ్లీ స్థానాలు 147: BJD-112, BJP-23, INC- 9, CPM-1, ఇండిపెండెంట్-1.
ఎంపీ స్థానాలు-21: BJD-12, BJP-8, INC-1
✒ అరుణాచల్ ప్రదేశ్: అసెంబ్లీ స్థానాలు 60: NDA-41, JDU-7, NPP-5, INC-4, PPA-1, ఇండిపెండెంట్లు-2
2 ఎంపీ స్థానాల్లో BJP గెలిచింది.
✒ సిక్కిం: అసెంబ్లీ స్థానాలు 32: సిక్కిం క్రాంతికారి మోర్చా-17, సిక్కిం డెమొక్రటిక్ ఫ్రంట్ -15
ఏకైక MP స్థానంలో సిక్కిం క్రాంతికారి మోర్చా గెలిచింది.

Similar News

News October 8, 2024

హ‌రియాణా ఎన్నిక‌ల‌పై కాంగ్రెస్ సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న‌

image

హరియాణా అసెంబ్లీ ఎన్నికల తీర్పును తిరస్కరిస్తున్న‌ట్టు కాంగ్రెస్ పార్టీ ప్ర‌క‌టించింది. ఓట్ల లెక్కింపు సందర్భంగా EVMలలో అవకతవకలు జరిగాయని ఆరోపించింది. ప్రజల అభీష్టాన్ని BJP తారుమారు చేసిందని దుయ్య‌బ‌ట్టింది. హ‌రియాణాలోని 3 జిల్లాల్లో EVMల ప‌నితీరుపై అనుమానాలు ఉన్నాయ‌ని కాంగ్రెస్ నేత‌లు జైరాం ర‌మేశ్, అభిషేక్ మ‌ను సింఘ్వీ పేర్కొన్నారు. BJPది ప్ర‌జాభీష్టాన్ని తారుమారు చేసిన విజ‌యంగా అభివ‌ర్ణించారు.

News October 8, 2024

రేపు బిగ్ అనౌన్స్‌మెంట్.. వెయిట్ చేయండి: లోకేశ్

image

AP: రేపు బిగ్ అనౌన్స్‌మెంట్ ఉండబోతోందంటూ ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్ ట్వీట్ చేశారు. టాటా సన్స్, టాటా గ్రూప్ ఛైర్మన్ నటరాజన్ చంద్రశేఖర్‌తో కలిసి దిగిన ఫొటోను షేర్ చేశారు. ఆయనతో సమావేశం ఫలప్రదంగా సాగిందని తెలిపారు. రేపటి ప్రకటన కోసం ఎదురుచూస్తూ ఉండాలని కోరారు. మరి ఏపీలో టాటా గ్రూప్ భారీ పెట్టుబడి పెడుతుందేమో చూడాలి.

News October 8, 2024

జమ్మూ-కశ్మీర్ ప్రజల భిన్నమైన తీర్పు

image

NDA నిర్ణయాలపై జమ్మూ, కశ్మీర్ ప్రజలు భిన్నంగా స్పందించినట్టు ఫలితాల సరళి స్పష్టం చేస్తోంది. ఆర్టిక‌ల్ 370 ర‌ద్దు, రాష్ట్రాన్ని కేంద్రపాలిత ప్రాంతంగా విభ‌జించ‌డం, LGకి అపరిమిత అధికారాలపై కశ్మీర్ వ్యాలీ ఓటర్లు ఆగ్ర‌హంగా ఉన్న‌ట్టు తెలుస్తోంది. అయితే జమ్మూలో మాత్రం BJP మెజారిటీ సీట్లు సాధించడం గమనార్హం. ఆ స్థాయిలో కశ్మీర్‌లో పోటీ చేసిన కొన్ని స్థానాల్లో BJP ఆశించిన ఫలితాల్ని రాబట్టలేకపోయింది.