News January 9, 2025
అధికారుల సేవ TTD కంటే TDPకే ఎక్కువ: అంబటి

AP: చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా తిరుపతిలో ఘోరం జరిగిందని వైసీపీ నేత అంబటి రాంబాబు అన్నారు. ‘అధికారులు టీటీడీ కంటే టీడీపీకే ఎక్కువ సేవ చేస్తున్నారు. ఆఫీసర్లపై చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేసి ఏం సాధించారు? అధికారులను తిడితే సమస్యలు పరిష్కారమవుతాయా? ఇదే నిర్లక్ష్యం కొనసాగితే మరిన్ని ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. క్షతగాత్రులకు ఒక్కొక్కరికి రూ.25 లక్షలు ఇవ్వాలి’ అని ఆయన డిమాండ్ చేశారు.
Similar News
News October 20, 2025
సీఎం రేవంత్‌తో కొండా సురేఖ దంపతుల భేటీ

TG: సీఎం రేవంత్ రెడ్డితో మంత్రి కొండా సురేఖ దంపతులు భేటీ అయ్యారు. జూబ్లీహిల్స్‌లోని సీఎం నివాసంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ ఆధ్వర్యంలో చర్చలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. రెడ్డి వర్గమంతా కలిసి తమపై కుట్ర చేస్తున్నారంటూ సురేఖ కూతురు సుస్మిత ఇటీవల చేసిన <<18019826>>ఆరోపణలు<<>> సంచలనంగా మారిన సంగతి తెలిసిందే.
News October 20, 2025
ప్రపంచం మొత్తానికి మీరు బాసా?.. ట్రంప్‌పై ఖమేనీ ఫైర్

ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్‌పై విరుచుకుపడ్డారు. ‘మీరు మా న్యూక్లియర్ సైట్లను ధ్వంసం చేశామని చెబుతున్నారు. మీ ఊహల్లో మీరు ఉండండి’ అని సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘మీరు మా సైంటిస్టులను చంపేశారు. కానీ వారి నాలెడ్జ్‌ను కాదు. ఒక దేశానికి న్యూక్లియర్ ఇండస్ట్రీ ఉంటే మీకు ఎందుకు? జోక్యం చేసుకోవడానికి మీరు ఎవరు? ప్రపంచం మొత్తానికి మిమ్మల్ని ఎన్నుకున్నారా?’ అని ప్రశ్నించారు.
News October 20, 2025
మన ఆచారాల వెనుక దాగున్న సైన్స్

మన సంప్రదాయాలు, ఆచారాల వెనుక ఆధ్యాత్మిక కారణాలే కాదు! ఆరోగ్య, శాస్త్రీయ కారణాలు కూడా ఉన్నాయి. ఉదాహరణకు మన పెద్దలు చెప్పులు ఇంటి బయటే వదలమంటారు. బయటకు వెళ్లి రాగానే కాళ్లూచేతులు కడగమంటారు. పుడితే పురుడని, మరణిస్తే అంటు అని అందరికీ దూరంగా ఉండాలంటారు. సెలూన్‌కి వెళ్తే స్నానం చేయనిదే ఇంట్లోకి రానివ్వరు. మహిళలు స్నానం చేయనిదే వండొద్దని అంటారు. వీటికి కారణం క్రిములను ఇంట్లోకి రాకుండా నిరోధించడమే.