News July 23, 2024
అధికారులు యుద్ధప్రాతిపదికన పనిచేయాలి: పవన్ కళ్యాణ్
AP: రాష్ట్రంలో వరద పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని అధికారులు యుద్ధ ప్రాతిపదికన పనిచేయాలని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదేశించారు. అంటువ్యాధులు ప్రబలే అవకాశం ఉన్నందున ఏమాత్రం అలసత్వం వద్దని సూచించారు. ప్రజలకు ఎప్పటికప్పుడు అందుబాటులో ఉండాలని, రక్షిత మంచినీటిపై దృష్టి సారించాలని స్పష్టం చేశారు. వరద ముంపు గ్రామాల గురించి ఆయన ఆరా తీసినట్లు జనసేన వర్గాలు తెలిపాయి.
Similar News
News January 28, 2025
ఫోన్ ఆపరేటింగ్ నేర్చుకున్న కేసీఆర్
TG: మాజీ సీఎం కేసీఆర్ సొంతంగా ఫోన్ వాడుతున్నారు. సీఎంగా ఉన్నన్ని రోజులు ఆయన ఫోన్ ఉపయోగించలేదు. కుటుంబసభ్యులు, నేతలు, సిబ్బంది ఫోన్లతోనే ఆయన ఇతరులతో మాట్లాడేవారు. ఇప్పుడు ఆయనకు కేటీఆర్ తనయుడు, తన మనవడు హిమాన్ష్ ఫోన్ ఆపరేట్ చేయడం నేర్పించారు. కేటీఆర్, హరీశ్, కవితతోపాటు పార్టీ ముఖ్య నేతలు, సన్నిహితుల ఫోన్ నంబర్లను సేవ్ చేసుకున్నారు. ఎప్పుడు కావాలంటే అప్పుడు ఫోన్లు చేసి మాట్లాడుతున్నారు.
News January 28, 2025
టెన్త్ విద్యార్థులకు సర్కార్ గుడ్ న్యూస్
AP: పదో తరగతి విద్యార్థులకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. సెలవుల్లోనూ వారికి మధ్యాహ్న భోజనం ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపింది. ఇందులో భాగంగా ఫిబ్రవరి 2 నుంచి మార్చి 10 వరకు విద్యార్థులకు భోజనం అందించాలని విద్యాశాఖను ప్రభుత్వం ఆదేశించింది. ఫిబ్రవరి 2 నుంచి మార్చి 10 వరకు రెండు రెండో శనివారాలు, ఆరు ఆదివారాలు ఉన్నాయి. ఆ రోజుల్లో విద్యార్థులకు భోజనం అందించాలని ఇప్పటికే ఉత్తర్వులు వెలువడ్డాయి.
News January 28, 2025
BJPలోకి అంబటి రాయుడు?
టీమ్ ఇండియా మాజీ క్రికెటర్ అంబటి రాయుుడు బీజేపీలో చేరతారని తెలుస్తోంది. ఇటీవల విశాఖపట్నంలో జరిగిన ఏబీవీపీ సభల్లో ఆయన పాల్గొన్నారు. ఆ సదస్సులో ఆయన బీజేపీకి అనుకూలంగా వ్యాఖ్యలు చేశారు. దేశం కోసం పని చేసే పార్టీ బీజేపీ ఒక్కటేనని ఆకాశానికెత్తారు. అప్పటి నుంచి ఆయన కాషాయ పార్టీ గూటికి చేరతారని వార్తలు వస్తున్నాయి. కాగా రాయుడు గతంలో వైసీపీలో చేరారు. అనంతరం ఆ పార్టీని వీడి జనసేన పార్టీతో కనిపించారు.