News November 23, 2024

OFFICIAL: ఝార్ఖండ్‌ ఫైనల్ రిజల్ట్

image

ఎగ్జిట్ పోల్ అంచ‌నాల‌ను త‌ల‌కిందులు చేస్తూ ఝార్ఖండ్‌లో ఇండియా కూట‌మి ఘ‌న విజ‌యం సాధించింది. JMM ఆధ్వ‌ర్యంలోని కూట‌మి మ్యాజిక్ ఫిగ‌ర్ 41 అధిగ‌మించి 56 స్థానాల్లో గెలుపొందింది. జేఎంఎం 34, కాంగ్రెస్ 16, ఆర్జేడీ 4, CPI ML(L) 2 స్థానాల్లో గెలుపొందాయి. బర్హైత్ నుంచి హేమంత్ సోరెన్ 39,791 ఓట్లతో, గాందే నుంచి క‌ల్ప‌న సోరెన్ 17,142 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. BJP 20 స్థానాల్లో గెలిచి ఒక చోట లీడ్‌లో ఉంది.

Similar News

News November 24, 2024

మోస్ట్ బ్యూటిఫుల్ గ్రౌండ్.. ఎక్కడంటే?

image

న్యూజిలాండ్‌లోని క్వీన్స్‌టౌన్ మైదానం మోస్ట్ బ్యూటిఫుల్ గ్రౌండ్‌గా మారింది. మంచు కొండల పక్కనే ఉన్న ఈ మైదానం చూపరులను ఆకట్టుకుంటోంది. చుట్టూ ఎలాంటి గోడలు, ఫెన్సింగ్ ఉండవు. స్వేచ్ఛగా మ్యాచ్ వీక్షించవచ్చు. ప్రస్తుతం ఈ స్టేడియంలో ఇంగ్లండ్, న్యూజిలాండ్ XI మధ్య వార్మప్ మ్యాచ్ జరుగుతోంది. ఈ మ్యాచ్ సందర్భంగా తీసిన ఫొటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

News November 24, 2024

చెప్పులు లేకుండా నడుస్తున్నారా?

image

పాదరక్షలు లేకుండా వాకింగ్ చేయడం వల్ల అనేక ప్రయోజనాలున్నాయని నిపుణులు చెబుతున్నారు. ‘పాదాలు నేరుగా నేలను తాకడం వల్ల విశ్రాంతిగా అనిపిస్తుంది. నాణ్యమైన నిద్ర, రోగనిరోధక శక్తి పెరుగుతుంది. ఒత్తిడి తగ్గుతుంది. రక్తప్రసరణ మెరుగుపడుతుంది. BP కంట్రోల్‌లో ఉంటుంది. కాలి కండరాలు బలపడతాయి’ అని పేర్కొంటున్నారు. షుగర్ పేషెంట్లు, అరికాళ్ల పగుళ్ల సమస్యలు ఉన్నవారు చెప్పులు లేకుండా నడవొద్దని సూచిస్తున్నారు.

News November 24, 2024

దేశంలోని 19 రాష్ట్రాల్లో NDA ప్రభుత్వాలు

image

BJP సారథ్యంలోని NDA కూటమి దేశంలోని 28 రాష్ట్రాల్లో 19 చోట్ల ప్రభుత్వ భాగస్వామిగా ఉంది. తమిళనాడు, కేరళ, కర్ణాటక, TG, పంజాబ్, హిమాచల్ ప్రదేశ్, ఝార్ఖండ్, మిజోరం, WBలలో కాంగ్రెస్, ఇతర ప్రాంతీయ పార్టీల ప్రభుత్వాలు నడుస్తున్నాయి. నేడు మహారాష్ట్రలో మహాయుతి ఘన విజయం సాధించిన నేపథ్యంలో NDA పాలించే రాష్ట్రాల మ్యాప్ వైరలవుతోంది. కాంగ్రెస్ స్వతహాగా 3 రాష్ట్రాల్లోనే (TG, HP, KA) ప్రభుత్వంలో ఉంది.