News November 23, 2024
OFFICIAL: ఝార్ఖండ్ ఫైనల్ రిజల్ట్

ఎగ్జిట్ పోల్ అంచనాలను తలకిందులు చేస్తూ ఝార్ఖండ్‌లో ఇండియా కూటమి ఘన విజయం సాధించింది. JMM ఆధ్వర్యంలోని కూటమి మ్యాజిక్ ఫిగర్ 41 అధిగమించి 56 స్థానాల్లో గెలుపొందింది. జేఎంఎం 34, కాంగ్రెస్ 16, ఆర్జేడీ 4, CPI ML(L) 2 స్థానాల్లో గెలుపొందాయి. బర్హైత్ నుంచి హేమంత్ సోరెన్ 39,791 ఓట్లతో, గాందే నుంచి కల్పన సోరెన్ 17,142 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. BJP 20 స్థానాల్లో గెలిచి ఒక చోట లీడ్‌లో ఉంది.
Similar News
News July 6, 2025
తొలి ఏకాదశి రోజు ఏం చేయాలంటే?

ఆషాఢ మాసంలో వచ్చే ఏకాదశిని తొలి ఏకాదశి/శయన ఏకాదశి అంటారు. ఈరోజు నుంచి విష్ణుమూర్తి యోగ నిద్రలోకి వెళ్తారని నమ్ముతారు. ఉదయాన్నే తలస్నానం చేసి విష్ణువును తులసి దళాలతో పూజిస్తారు. ఈరోజు పూజించడం వల్ల ఆయన అనుగ్రహం లభిస్తుందని, ఏకాదశి రోజున ఉపవాసముంటే మోక్షం కలుగుతుందని నమ్ముతారు. అలాగే ఈ ఒక్కరోజు ఉపవాసముంటే సంవత్సరంలోని అన్ని ఏకాదశుల ఉపవాస ఫలితం లభిస్తుందని పండితులు చెబుతారు.
News July 6, 2025
ప్రపంచస్థాయి కెమికల్ హబ్స్ రావాలి: నీతిఆయోగ్

ప్రపంచస్థాయి కెమికల్స్ హబ్స్ స్థాపనపై కేంద్రం దృష్టి పెట్టాలని నీతి ఆయోగ్ ఓ నివేదికలో పేర్కొంది. ‘అత్యధిక సామర్థ్యాలుండే 8 పోర్ట్-ఇన్‌ఫ్రాస్ట్రక్చర్స్‌నూ స్థాపించాలి. 2040నాటికి భారత్ లక్షకోట్ల డాలర్ల రసాయనాల ఉత్పత్తి లక్ష్యంగా పెట్టుకుంది. 2023లో గ్లోబల్ వ్యాల్యూ చెయిన్‌లో 3.5%గా ఉన్న వాటా 2040నాటికి 4-5శాతానికి పెరగనుంది. 2030నాటికి 7 లక్షల ఉద్యోగాల కల్పన జరుగుతుంది’ అని నివేదికలో వివరించింది.
News July 6, 2025
మస్క్ కొత్త పార్టీతో ట్రంప్‌నకు నష్టమేనా?

ఎలాన్ మస్క్ ‘అమెరికా పార్టీ’ స్థాపించడం రిపబ్లిక్, డెమొక్రాటిక్ పార్టీలకు నష్టం చేకూర్చే అవకాశముంది. ముఖ్యంగా ట్రంప్‌నకు తలనొప్పి తీసుకురావొచ్చు. మస్క్ అపర కుబేరుడు, ఒక గొప్ప వ్యాపారవేత్త, ఒక్క ట్వీటుతో లక్షల మందిని ప్రభావితం చేయగల ఇన్‌ఫ్లుఎన్సర్. పైగా ‘మేక్ అమెరికా.. అమెరికా అగైన్’, ప్రజలకు స్వేచ్ఛనిప్పిస్తా అంటున్నారు. అయితే USలో 3 పార్టీల విధానం వర్కౌట్ అవ్వదని రాజకీయ నిపుణులు భావిస్తున్నారు.