News November 27, 2024
OFFICIAL: పెళ్లిపై కీర్తి సురేశ్ ప్రకటన

తన పెళ్లిపై హీరోయిన్ కీర్తి సురేశ్ ప్రకటన చేశారు. తాను ఆంటోనీని పెళ్లి చేసుకోబోతున్నట్లు ట్వీట్ చేశారు. 15 సంవత్సరాలుగా తాము ప్రేమలో ఉన్నామని తెలిపారు. ‘AntoNY x KEerthy (Iykyk)’ అని క్యాప్షన్ పెట్టారు. వారిద్దరూ కలిసి ఉన్న ఫొటోను షేర్ చేశారు. కాగా చిన్నప్పటి నుంచి కీర్తి, ఆంటోనీ కలిసి చదువుకున్నారు. ఇంటర్ నుంచి వారి స్నేహం ప్రేమగా మారిందని కీర్తి తండ్రి ఇటీవల ఓ ఇంటర్వ్యూలో చెప్పారు.
Similar News
News January 31, 2026
పోస్టాఫీసుల్లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల

పోస్టాఫీసుల్లో GDS పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. టెన్త్ అర్హత గల అభ్యర్థులు నేటి నుంచి ఫిబ్రవరి 14వరకు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. దరఖాస్తులను ఫిబ్రవరి 2 – ఫిబ్రవరి 16 వరకు స్వీకరిస్తారు. ఈ నోటిఫికేషన్ ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో BPM, ABPM పోస్టులను భర్తీ చేయనున్నారు. టెన్త్ మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తారు. వయసు 18 నుంచి 40ఏళ్ల మధ్య ఉండాలి. వెబ్సైట్: https://indiapost.gov.in/
News January 31, 2026
‘దశరథ గడ్డి’ని ఎలా సాగు చేయాలి?

దశరథ గడ్డి(హెడ్జ్ లూసర్న్) పాడి పశువులకు, జీవాలకు మేలు చేసే బహువార్షిక పప్పుధాన్యపు గడ్డి. ఇందులో మాంసకృత్తులు, ప్రొటీన్లు, ఫైబర్, లిగ్నిన్ తదితర పోషకాలు అధికంగా ఉంటాయి. దీన్ని ఏడాది పొడవునా సాగుచేయవచ్చు. ఎకరాలో సాగుకు 10kgల విత్తనాలు సరిపోతాయి. కేజీ విత్తనానికి కేజీ ఇసుకను కలిపి వేయాలి. నీరు నిల్వ ఉండే నేలలు, చౌడు నేలలు దశరథ గడ్డి సాగుకు పనికిరావు. ఒక హెక్టారుకు 90-100 టన్నుల పశుగ్రాసం వస్తుంది.
News January 31, 2026
2 నుంచి ఇంటర్ ప్రాక్టికల్స్ షురూ.. CCTVల నిఘాలో పరీక్షలు

TG: రాష్ట్రవ్యాప్తంగా ఫిబ్రవరి 2 నుంచి 11 వరకు ఇంటర్మీడియట్ ప్రాక్టికల్ పరీక్షలు జరగనున్నాయి. ఇందుకోసం అధికారులు 1,440 పరీక్షా కేంద్రాలను సిద్ధం చేశారు. ఉదయం 9-12, మధ్యాహ్నం 2-5 గంటల మధ్య ఎగ్జామ్స్ నిర్వహిస్తారు. అన్ని సెంటర్లలో CCTV కెమెరాలు ఏర్పాటు చేశారు. ఈ పరీక్షలకు సైన్స్ స్ట్రీమ్ నుంచి 4 లక్షలు, వొకేషనల్ నుంచి లక్ష మంది హాజరవుతారు. ఇప్పటికే వెబ్సైట్లో హాల్టికెట్లు అందుబాటులో ఉంచారు.


