News November 27, 2024

OFFICIAL: పెళ్లిపై కీర్తి సురేశ్ ప్రకటన

image

తన పెళ్లిపై హీరోయిన్ కీర్తి సురేశ్ ప్రకటన చేశారు. తాను ఆంటోనీని పెళ్లి చేసుకోబోతున్నట్లు ట్వీట్ చేశారు. 15 సంవత్సరాలుగా తాము ప్రేమలో ఉన్నామని తెలిపారు. ‘AntoNY x KEerthy (Iykyk)’ అని క్యాప్షన్ పెట్టారు. వారిద్దరూ కలిసి ఉన్న ఫొటోను షేర్ చేశారు. కాగా చిన్నప్పటి నుంచి కీర్తి, ఆంటోనీ కలిసి చదువుకున్నారు. ఇంటర్ నుంచి వారి స్నేహం ప్రేమగా మారిందని కీర్తి తండ్రి ఇటీవల ఓ ఇంటర్వ్యూలో చెప్పారు.

Similar News

News February 7, 2026

ఈ చిచ్చరపిడుగును WC జట్టులోకి తీసుకోవాల్సిందేనా?

image

వైభవ్ సూర్యవంశీ. వయసు 14 ఏళ్లు. ఆడుతోంది వరల్డ్ కప్ ఫైనల్. అయితే ఏంటి? 15 సిక్సర్లు, 15 ఫోర్లతో ఇంగ్లండ్ బౌలర్లకు చుక్కలు చూపించారు. కేవలం 80 బంతుల్లోనే 175 రన్స్ చేశారు. వైభవ్ ఇంకొన్ని ఓవర్లు క్రీజులో ఉండి ఉంటే భారత్ స్కోర్ ఈజీగా 500 దాటేది. దీంతో ఈ పిల్లాడిని త్వరగా టీమ్ ఇండియాలోకి తీసుకోవాలని నెటిజన్లు పోస్టులు చేస్తున్నారు. వీలైతే T20 WC జట్టులోకి తీసుకోవాలని అభిప్రాయపడుతున్నారు. COMMENT?

News February 7, 2026

చక్కటి నిద్ర కోసం సింపుల్ టిప్స్

image

*ప్రతిరోజు ఒకే సమయానికి పడుకోవడం, నిద్రలేవడం అలవాటు చేసుకోవాలి.
*గదిలో చీకటిగా, నిశ్శబ్దంగా ఉండేలా చూసుకోవాలి. ఐ మాస్క్ ధరించాలి.
*రాత్రిపూట ఆలస్యంగా భోజనం చేయకూడదు.
*పడుకోవడానికి 3-4 గంటల ముందు మద్యం సేవించవద్దు.
*రోజూ ఉదయం వ్యాయామం చేయడంతో పాటు ఉదయాన్నే కనీసం 30 నిమిషాల పాటు సూర్యరశ్మి తగిలేలా చూసుకోవాలి.

News February 6, 2026

రియల్ ఎస్టేట్‌కు RBI బూస్ట్.. REITsకు నేరుగా లోన్లు

image

రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్‌మెంట్ ట్రస్ట్ (REITs)లకు బ్యాంకులు నేరుగా లోన్లు ఇచ్చేందుకు RBI అనుమతించనుంది. ఇది రియల్ ఎస్టేట్ రంగానికి కొత్త ఊపు ఇవ్వనుంది. ఇప్పటివరకు కేవలం బాండ్లు, ఈక్విటీలపై ఆధారపడ్డ REITs ఇకపై బ్యాంకులనుంచి తక్కువ వడ్డీకే లాంగ్ టర్మ్ లోన్లు పొందొచ్చు. దీంతో ఆఫీస్ బిల్డింగ్స్, మాల్స్ వంటి ప్రాజెక్టులను చాలా ఫాస్ట్‌గా కంప్లీట్ చేయొచ్చు. కమర్షియల్ రియల్ ఎస్టేట్ మరింత బలోపేతం అవుతుంది.