News November 18, 2024
OFFICIAL: నాగచైతన్య-శోభితల శుభలేఖ ఇదే

నాగచైతన్య, శోభితల వెడ్డింగ్ కార్డ్ బయటకు వచ్చింది. డిసెంబర్ 4న హైదరాబాద్ బంజారాహిల్స్‌లోని అన్నపూర్ణ స్డూడియోస్‌లో పెళ్లి జరగనుంది. రాత్రి 8.13 గంటలకు ముహూర్తం ఫిక్స్ చేశారు. ధూళిపాళ శాంతకామాక్షి, వేణుగోపాలరావుల కూతురైన శోభిత మెడలో చైతూ మూడుముళ్లు వేయనున్నారు.
Similar News
News March 15, 2026
పెన్షన్ పెంపు, మహిళలకు రూ.2,500.. త్వరలో కీలక ప్రకటన!

TG: ఎన్నికల వేళ ఇచ్చిన హామీల్లో పెండింగ్‌లో ఉన్నవాటి అమలు దిశగా రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. 18 ఏళ్లు నిండిన మహిళలకు నెలకు రూ.2,500, పెన్షన్ రూ.4,000కు పెంపు హామీలపై రేపటి నుంచి జరిగే అసెంబ్లీ సమావేశాల్లో సీఎం ప్రకటన చేస్తారని విశ్వసనీయ సమాచారం. ఇక కొత్త సంక్షేమ పథకాలు, నీటిపారుదల, మౌలిక సదుపాయాలు, పట్టణాభివృద్ధి వంటి అంశాలపైనా కీలక నిర్ణయాలు వెల్లడించనున్నట్లు తెలుస్తోంది.
News March 15, 2026
సీక్రెట్‌గా పెళ్లి చేసుకున్న RCB క్రికెటర్!

RCB కీలక బౌలర్ యశ్ దయాల్ సీక్రెట్‌గా పెళ్లి చేసుకున్నట్లు సమాచారం. ఫిబ్రవరి 4న కంటెంట్ క్రియేటర్ శ్వేతా పుండీర్‌తో వివాహం జరిగినట్లు తాజాగా క్రీడా వర్గాలు తెలిపాయి. కుటుంబ సభ్యులు, సన్నిహితుల మధ్యే అతడికి పెళ్లి జరిగినట్లు తెలుస్తోంది. మైనర్‌పై లైంగిక దాడికి పాల్పడినట్లు అతడిపై కేసు ఉన్న విషయం తెలిసిందే. రాజస్థాన్ హైకోర్టు యశ్‌కు అరెస్ట్ నుంచి రక్షణ కల్పించింది.
News March 15, 2026
దీదీ వర్సెస్ మోదీ.. బెంగాల్‌లో దంగల్

బెంగాల్‌లో APR 23, 29న అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. దేశంలో కాషాయాన్ని విస్తరిస్తున్న BJP బెంగాల్‌లోనూ పాగా వేయాలని ఉవ్విళ్లూరుతోంది. మోదీ స్వయంగా ఆ రాష్ట్రంలో పర్యటిస్తూ ఓటర్లను ఆకర్షిస్తున్నారు. మరోవైపు TMC చీఫ్ మమతా బెనర్జీ(దీదీ) మరోసారి అధికారాన్ని కాపాడుకునేందుకు కష్టపడుతున్నారు. రాష్ట్రంలో కమలం వికసించకుండా చేయాలని వ్యూహాలు రచిస్తున్నారు. దీంతో బెంగాల్‌లో దంగల్ ఫైట్ రసవత్తరంగా మారింది.


