News May 17, 2024
అధికారులు అప్రమత్తంగా ఉండాలి: CM రేవంత్
TG: భారీ వర్షాల నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని CM రేవంత్ సూచించారు. ప్రజలకు ఇబ్బందులు లేకుండా అవసరమైన చర్యలు చేపట్టాలని ఆదేశించారు. మ్యాన్‌హోల్స్ నిర్వహణ, వరద ముంపు నివారణపై దృష్టి సారించాలన్నారు. విద్యుత్ సరఫరా స్తంభించకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ఇదిలా ఉంటే ఈ నెల 20వ తేదీ వరకు వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ తెలిపింది. నిన్న పిడుగుపాటుతో రాష్ట్రంలో ముగ్గురు మరణించారు.
Similar News
News January 11, 2025
మద్యం ధరలు పెంచే ప్రసక్తే లేదు: సీఎం రేవంత్
TG: లిక్కర్ కంపెనీల ఎంపికలో పారదర్శకత పాటించాలని సీఎం రేవంత్ ఎక్సైజ్ అధికారులను ఆదేశించారు. కొత్త కంపెనీలు దరఖాస్తు చేసుకునేందుకు వారికి కనీసం నెలరోజుల సమయం ఇవ్వాలని సూచించారు. ‘రాష్ట్రంలో కొత్త బ్రాండ్ల సరఫరాకు ఈజీ డూయింగ్ పాలసీ అనుసరించాలి. కొత్త కంపెనీలను అనుమతించే విషయంలో అప్రమత్తంగా ఉండాలి. లిక్కర్ కంపెనీల ఒత్తిడికి తలొగ్గి మద్యం ధరలు పెంచే ప్రసక్తే లేదు’ అని ఆయన స్పష్టం చేశారు.
News January 11, 2025
గాయంతో హీరోయిన్ రష్మిక(PHOTOS)
జిమ్‌లో గాయపడ్డ హీరోయిన్ రష్మిక తాజా ఫొటోలను పంచుకున్నారు. ‘కోలుకునేందుకు రోజులు, నెలలు పడుతుందో దేవుడికే తెలియాలి. త్వరలోనే సికందర్, కుబేర సెట్స్‌లోకి అడుగుపెడతానని ఆశిస్తున్నా. ఆలస్యానికి నా దర్శకులకు క్షమాపణలు. త్వరగా తిరిగొచ్చి యాక్షన్ సీన్లు చేయడానికి ప్రయత్నిస్తాను. ఈలోగా అవసరమైతే ఏదో ఒక మూలన కూర్చొని అడ్వాన్స్ పనులు చేస్తాను’ అని ఆమె పోస్ట్ పెట్టారు.
News January 11, 2025
విద్యార్థులకు శుభవార్త: లోకేశ్
AP: సంక్రాంతి పండుగ వేళ విద్యార్థులకు CM చంద్రబాబు శుభవార్త అందించారని మంత్రి లోకేశ్ ట్వీట్ చేశారు. ‘కంసమామ మోసం చేసి పోతే చంద్రన్న న్యాయం చేస్తున్నారు. జగన్ బకాయిలు పెట్టిన ఫీజు రీయింబర్స్‌మెంట్ డబ్బులను విడుదల చేస్తున్నారు. గత పాలకుల పాపాలకు విద్యార్థులు బలి కాకూడదని నేను మంత్రి అయ్యాక విద్యార్థులకు సర్టిఫికెట్లు ఇచ్చే ఏర్పాట్లు చేశాం. రూ.788 కోట్లు చెల్లిస్తున్నాం’ అని లోకేశ్ Xలో ట్వీట్ చేశారు.