News August 31, 2024
అధికారులు అప్రమత్తంగా ఉండాలి: CM రేవంత్
TG: భారీ వర్షాల నేపథ్యంలో ప్రభుత్వ అధికారులు, సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని CM రేవంత్ ఆదేశించారు. మున్సిపల్, విద్యుత్, వైద్యారోగ్య, రెవెన్యూ శాఖలు మరింత చురుకుగా వ్యవహరించాలన్నారు. అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా జాగ్రత్త వహించాలని, లోతట్టు ప్రాంతాల ప్రజలను సహాయక శిబిరాలకు తరలించాలన్నారు. రిజర్వాయర్ల గేట్లు ఎత్తే ముందు దిగువ ప్రాంత ప్రజలను అప్రమత్తం చేయాలని చెప్పారు.
Similar News
News September 8, 2024
వారిపై ఎలాంటి వ్యాఖ్యలు చేయవద్దు.. బ్రిజ్ భూషణ్‌కు బీజేపీ హుకుం
కాంగ్రెస్‌లో చేరిన రెజ్లర్లు వినేశ్ ఫొగట్, బజరంగ్ పునియాను ఉద్దేశించి ఎలాంటి వ్యాఖ్యలు చేయవద్దని WFI మాజీ అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్‌ను BJP ఆదేశించినట్టు తెలుస్తోంది. రెజ్లర్లపై వేధింపుల ఆరోపణల వెనక కాంగ్రెస్ కుట్ర ఉందని, దీనికి హరియాణా EX CM భూపిందర్ సింగ్ హుడా పథక రచన చేశారని బ్రిజ్ భూషణ్ ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలో వినేశ్, బజరంగ్‌పై వ్యాఖ్యలు మానుకోవాలని BJP ఆదేశించడం గమనార్హం.
News September 8, 2024
‘ఎమర్జెన్సీ’కి U/A సర్టిఫికెట్.. కొన్ని సీన్లు కట్ చేయాలని ఆదేశం
బాలీవుడ్ నటి కంగన నటించిన ఎమర్జెన్సీ చిత్రానికి సెన్సార్ బోర్డు ఎట్టకేలకు సర్టిఫికెట్ జారీ చేసింది. సిక్కు వర్గాల నుంచి ఈ చిత్రానికి పెద్ద ఎత్తున వ్యతిరేకత రావడంతో గతంలో బోర్డు సర్టిఫికెట్ జారీని నిలిపేసింది. దీంతో ఈ నెల 6న విడుదల కావాల్సిన చిత్రం వాయిదా పడింది. తాజాగా U/A సర్టిఫికెట్ ఇచ్చిన బోర్డు కొన్ని సీన్లు డిలీట్ చేసి, డిస్‌క్లెయిమర్స్ యాడ్ చేయాలని ఆదేశించినట్టు తెలుస్తోంది.
News September 8, 2024
భారీ వర్షాలు.. కలెక్టర్లకు సీఎం చంద్రబాబు ఆదేశాలు
ఏపీలోని పలు జిల్లాలకు భారీ వర్ష సూచన నేపథ్యంలో ఆయా జిల్లాల కలెక్టర్లతో CM చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. కాలువలు, చెరువులు, డ్రెయిన్లకు గండ్లు పడకుండా చూసుకోవాలని ఆదేశించారు. ఆహారం, తాగునీరు, వైద్యశిబిరాలు ఏర్పాటుకు సిద్ధంగా ఉండాలన్నారు. వరద ప్రభావిత ప్రాంత ప్రజలకు నచ్చజెప్పి పునరావాస కేంద్రాలకు తరలించాలని చెప్పారు. జిల్లా స్థాయిలో చేస్తున్న పనులకు తక్షణం నిధులు విడుదల చేస్తామని తెలిపారు.