News July 17, 2024

రేషన్ కార్డులు లేని రైతుల వద్దకు అధికారులు: మంత్రి తుమ్మల

image

TG: అర్హులైన రైతులకు రేషన్‌కార్డు లేకపోయినా రుణమాఫీ చేస్తామని ప్రభుత్వం స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. రేషన్ కార్డులు లేని రైతుల వద్దకు అధికారులు వచ్చి పరిశీలిస్తారని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. రాష్ట్రంలో మొత్తం 33 బ్యాంకులు రైతులకు రుణాలిచ్చాయని, నకిలీ పట్టా పాసు పుస్తకాలు పెట్టి లోన్లు తీసుకున్న వారిని గుర్తించామని చెప్పారు. రూ.లక్ష జీతం ఉన్న వారికి రుణమాఫీ వర్తించదని స్పష్టం చేశారు.

Similar News

News November 23, 2025

జిల్లాస్థాయి చెకుముఖి పోటీల్లో గర్భాం ఏపీ మోడల్ విద్యార్థులు

image

విజయనగరం జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో ఆదివారం జిల్లా స్థాయి చెకుముఖి పోటీలు జరిగాయి. గర్భాం ఏపీ మోడల్ స్కూల్ విద్యార్థులు ఈ పోటీల్లో ప్రథమ స్థానంలో నిలిచారు. వచ్చె నెల 12,13,14 తేదీల్లో కాకినాడలో జరిగే రాష్ట్రస్థాయి పోటీలలో సైన్స్ ఎక్స్పో లో పాల్గొంటారని ప్రిన్సిపల్ అరుణ తెలిపారు. విద్యార్థులకు జనవిజ్ఞాన వేదిక మెరకముడిదాం మండల శాఖ ఇన్‌ఛార్జి ఎం.రఘునాథరాజు, నవీన్ అభినందించారు.

News November 23, 2025

సర్పంచ్ ఎన్నికల ఖర్చు అంతే!

image

TG: సర్పంచ్ ఎన్నికల ఖర్చు విషయంలో ఎన్నికల సంఘం అధికారులు మరోసారి స్పష్టత ఇచ్చారు. 2011 సెన్సెస్ ఆధారంగా ఖర్చు ఉంటుందని వెల్లడించారు. 5వేల ఓటర్లకు పైగా ఉన్న గ్రామాల్లో సర్పంచ్ అభ్యర్థి రూ.2.50 లక్షలు, 5 వేల లోపు పంచాయతీల్లో రూ.1.50 లక్షలు, 5 వేలకు పైగా జనాభా ఉన్న గ్రామాల్లో వార్డు సభ్యులకు రూ.50 వేలు, 5 వేలకు తక్కువగా ఉన్న గ్రామాల్లో రూ.30 వేల చొప్పున ఖర్చు పెట్టాల్సి ఉంటుందని వివరించారు.

News November 23, 2025

వాన్‌ Vs వసీం.. ఈసారి షారుఖ్ మూవీ పోస్టర్‌తో!

image

యాషెస్ తొలి టెస్టులో ENG ఓటమితో ఆ జట్టు మాజీ క్రికెటర్‌ మైఖేల్ వాన్‌ను భారత మాజీ క్రికెటర్ వసీం జాఫర్ ట్రోల్ చేశారు. మ్యాచ్ 2వ రోజు ENG ఆధిపత్యం చెలాయిస్తుందని వాన్ చెప్పారు. కానీ హెడ్ చెలరేగడంతో AUS గెలిచింది. దీంతో వసీం ‘కభీ ఖుషీ కభీ ఘమ్’ ఫొటో పోస్ట్ చేసి ‘Hope you’re okay @michaelvaughan’ అని పేర్కొన్నారు. గతంలోనూ IND, ENG మ్యాచుల సందర్భంలో పుష్ప, జవాన్ మీమ్స్‌తో వసీం ట్రోల్ చేశారు.