News July 17, 2024
రేషన్ కార్డులు లేని రైతుల వద్దకు అధికారులు: మంత్రి తుమ్మల
TG: అర్హులైన రైతులకు రేషన్‌కార్డు లేకపోయినా రుణమాఫీ చేస్తామని ప్రభుత్వం స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. రేషన్ కార్డులు లేని రైతుల వద్దకు అధికారులు వచ్చి పరిశీలిస్తారని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. రాష్ట్రంలో మొత్తం 33 బ్యాంకులు రైతులకు రుణాలిచ్చాయని, నకిలీ పట్టా పాసు పుస్తకాలు పెట్టి లోన్లు తీసుకున్న వారిని గుర్తించామని చెప్పారు. రూ.లక్ష జీతం ఉన్న వారికి రుణమాఫీ వర్తించదని స్పష్టం చేశారు.
Similar News
News December 1, 2024
రూ.10 కోసం పోలీసులకు ఫిర్యాదు!
రూ.10 బాకీ పడిన మనిషి ఆ మొత్తాన్ని ఇవ్వడం లేదని ఓ వ్యక్తి పోలీసుల్ని ఆశ్రయించిన ఆసక్తికర ఘటన ఇది. UPలోని హర్దోయ్ ప్రాంతానికి చెందిన జితేంద్ర పాన్ షాప్ నడుపుకుంటున్నారు. సంజయ్ అనే కస్టమర్ ఏడాదిన్నర క్రితం గుట్కా ప్యాకెట్ కొని రూ.10 అరువు పెట్టాడు. ఎన్నిసార్లు అడిగినా ఇవ్వడం లేదని విసిగిపోయిన జితేంద్ర, పోలీస్ హెల్ప్‌లైన్ 112కి ఫోన్ చేశారు. పోలీసులు వచ్చి సంజయ్ నుంచి రూ.10ని జితేంద్రకి ఇప్పించారు.
News December 1, 2024
ఇది మహారాష్ట్రకు అవమానకరం: ఆదిత్య ఠాక్రే
ఎన్నికల ఫలితాలు వెలువడి వారం గడుస్తున్నా ప్రభుత్వం ఏర్పాటు కాకపోవడం మహారాష్ట్రకు అవమానకరమని శివసేన UBT నేత ఆదిత్య ఠాక్రే విమర్శించారు. అసెంబ్లీ గడువు ముగిసినా రాష్ట్రపతి పాలన ఎందుకు విధించడం లేదని ప్రశ్నించారు. ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన బలాన్ని క్లైం చేసుకోకుండానే ప్రమాణస్వీకారానికి తేదీ ప్రకటించడం అరాచకమని మండిపడ్డారు. వర్లీ నుంచి ఆదిత్య గెలిచిన విషయం తెలిసిందే.
News December 1, 2024
రేపు చిత్తూరు జిల్లాలో విద్యాసంస్థలకు సెలవు
AP: ఫెంగల్ తుఫాన్ ప్రభావంతో రేపు చిత్తూరు జిల్లా వ్యాప్తంగా అన్ని స్కూళ్లు, కాలేజీలకు సెలవు ఇస్తున్నట్లు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ ప్రకటించారు. సోమవారం కూడా జిల్లా వ్యాప్తంగా కుండపోత వర్షాలు పడతాయని వాతావరణ శాఖ హెచ్చరికలతో ముందస్తుగా సెలవు ఇచ్చారు. అటు నెల్లూరు, తిరుపతి, YSR జిల్లాల్లోనూ సెలవు ఇవ్వాలని విద్యార్థులు, తల్లిదండ్రులు కోరుతున్నారు.