News May 18, 2024
అయ్యో అన్నదాత..!
TG: సాగులో సమయానికి రాని వర్షాలు.. పంట చేతికి వచ్చే సమయంలో వచ్చి అన్నదాతలకు కన్నీళ్లు పెట్టిస్తున్నాయి. ఇటీవల వడగళ్ల వానలతో రాష్ట్రంలో పంటలు దెబ్బతిన్నాయి. ప్రభుత్వాలు పరిహారాలు ప్రకటిస్తున్నా అవి పూర్తి స్థాయిలో అందడం లేదని రైతన్నలు వాపోతున్నారు. పంటలో 3వ వంతుకంటే ఎక్కువ నష్టపోతేనే అర్హులని చెప్పడంతో ఆలోపు నష్టపోయిన వారికి ఎలాంటి సాయం అందడం లేదు. దీనికి తోడు ప్రస్తుతం పంటల బీమాలేవీ అమల్లో లేవు.
Similar News
News January 12, 2025
శ్రీవారితో రాజకీయాలు చేస్తే ఫలితాలు ఇలానే ఉంటాయి: కన్నబాబు
AP: తిరుమల ప్రసాదాన్ని కూటమి సర్కార్ రాజకీయం చేసిందని, అలా చేస్తే ఫలితాలు ఇలానే ఉంటాయని వైసీపీ నేత కన్నబాబు అన్నారు. తిరుపతి తొక్కిసలాటపై సీఎం చంద్రబాబు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ‘తిరుపతి తొక్కిసలాట ముమ్మాటికీ ప్రభుత్వ వైఫల్యమే. తెలుగు భాషలో నాకు నచ్చని ఒకే ఒక పదం క్షమాపణ అన్నట్లు టీటీడీ ఛైర్మన్ మాట్లాడుతున్నారు. ఈ సంక్రాంతి పేదల పండుగ కాదు.. పచ్చ నేతల పండుగ’ అని ఆయన ధ్వజమెత్తారు.
News January 12, 2025
ఛాంపియన్స్ ట్రోఫీకి కివీస్ టీమ్ ఇదే
ఛాంపియన్స్ ట్రోఫీకి న్యూజిలాండ్ తమ జట్టును ప్రకటించింది. 15 మందితో కూడిన ఈ జట్టుకు మిచెల్ శాంట్నర్ సారథ్యం వహిస్తారు. సీనియర్ ప్లేయర్ కేన్ విలియమ్సన్ రీఎంట్రీ ఇచ్చారు. జట్టు: శాంట్నర్ (C), మైకేల్ బ్రేస్‌వెల్, మార్క్ చాప్‌మన్, డేవాన్ కాన్వే, లాకీ ఫెర్గ్యూసన్, మాట్ హెన్రీ, టామ్ లాథమ్, డారిల్ మిచెల్, విల్ ఓ రూర్కీ, గ్లెన్ ఫిలిప్స్, రచిన్ రవీంద్ర, బెన్ సియర్స్, నాథన్ స్మిత్, విలియమ్సన్, విల్ యంగ్.
News January 12, 2025
ఎన్‌కౌంటర్‌లో నలుగురు మావోయిస్టుల మృతి
ఛత్తీస్‌గఢ్‌లో జరిగిన ఎన్‌కౌంటర్‌లో నలుగురు మావోయిస్టులు మృతిచెందారు. మద్దేడు పీఎస్ పరిధిలో ఈ ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి. సంఘటనా స్థలంలో భారీగా ఆయుధాలు లభించాయి. దీనిపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.