News August 12, 2024
దూసుకెళ్తున్న ఓలా షేర్లు

గత వారం మార్కెట్‌లో ఫ్లాట్‌గా లిస్ట్ అయిన ఓలా ఎలక్ట్రిక్ షేర్లు అదరగొడుతున్నాయి. షేర్‌ను రూ.72 నుంచి రూ.76 మధ్య లిస్ట్ చేయగా, రెండు రోజుల్లోనే 44 శాతం పెరిగాయి. BSEలో ఈరోజు 109.44 మార్కును తాకాయి. ఓలా మొత్తం మార్కెట్ విలువ ప్రస్తుతం రూ.48,250 కోట్లకు చేరింది. జూన్ త్రైమాసిక సంపాదన వివరాలు ఈ నెల 14న వెల్లడించనున్నట్లు ఎక్స్ఛేంజ్ ఫైలింగ్‌లో ఓలా తెలిపింది.
Similar News
News July 9, 2025
పుట్టినరోజు శుభాకాంక్షలు

ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.
News July 9, 2025
విశాఖలో సత్వా వాంటేజ్ మిక్స్డ్ క్యాంపస్

AP: రియాలిటీ సంస్థ సత్వా గ్రూప్ విశాఖలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొచ్చింది. బెంగళూరులో మంత్రి లోకేశ్ ఆ సంస్థ ప్రతినిధులతో సమావేశమయ్యారు. తర్వాత ఆసంస్థ 30ఎకరాల్లో రూ.1500 కోట్లతో వాంటేజ్ మిక్స్డ్ డెవలప్మెంట్ క్యాంపస్ ఏర్పాటు చేయబోతున్నట్లు ప్రకటించింది. దీంతో 25 వేల మందికి ఉద్యోగాలు వస్తాయని లోకేశ్ తెలిపారు. ANSR సంస్థ కూడా విశాఖలో GCC ఇన్నోవేషన్ క్యాంపస్ ఏర్పాటుకు ప్రభుత్వంతో MOU చేసుకుంది.
News July 9, 2025
ఈ రోజు నమాజ్ వేళలు (జులై 9, బుధవారం)

✒ ఫజర్: తెల్లవారుజామున 4.27 గంటలకు
✒ సూర్యోదయం: ఉదయం 5.48 గంటలకు
✒ దుహర్: మధ్యాహ్నం 12.21 గంటలకు
✒ అసర్: సాయంత్రం 4.57 గంటలకు
✒ మఘ్రిబ్: సాయంత్రం 6.55 గంటలకు
✒ ఇష: రాత్రి 8.16 గంటలకు
✒ NOTE: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.