News April 29, 2024
50 ఏళ్లకే బీసీలకు వృద్ధాప్య పింఛను: చంద్రబాబు

AP: వైసీపీ మళ్లీ అధికారంలోకి వస్తే వ్యాపారస్థులు కప్పం కట్టే దుస్థితి ఏర్పడుతుందని చంద్రబాబు విమర్శించారు. ‘జగన్ గత ఎన్నికల్లో కోడికత్తి, ఇప్పుడు గులకరాయి డ్రామా ఆడుతున్నారు. వివేకాను ఎవరు చంపారు? రాయలసీమకు ఏమీ చేయని YCP నేతలకు ఎందుకు ఓట్లు వేయాలి? మా ప్రభుత్వం వచ్చాక 50 ఏళ్లకే BCలకు వృద్ధాప్య పింఛను ఇస్తాం. BC, SC, STలను ఆర్థికంగా పైకి తీసుకొస్తా. ముస్లింలకు అన్యాయం జరగనివ్వను’ అని చెప్పారు.
Similar News
News November 8, 2025
చలి పెరుగుతుంది.. జాగ్రత్త: IMD

దేశవ్యాప్తంగా వర్షాలు దాదాపుగా తగ్గుముఖం పట్టాయి. ఈ నేపథ్యంలో రాత్రి వేళల్లో చలి పెరుగుతుందని IMD పేర్కొంది. ‘వాయవ్య, సెంట్రల్ ఇండియాలో వచ్చే వారం రోజుల్లో ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 2-5°C తక్కువగా ఉండే అవకాశముంది. సెంట్రల్, వెస్ట్ ఇండియాలో వచ్చే 48 గంటల్లో 2-3°C, ఈస్ట్ ఇండియాలో వచ్చే 3 రోజుల్లో 3-4°C తగ్గుదల ఉండొచ్చు’ అని అంచనా వేసింది. ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది.
News November 8, 2025
నేడు సంకటహర చతుర్థి

ప్రతి మాసంలో వచ్చే పౌర్ణమి తర్వాత, కృష్ణ పక్షంలో నాల్గవ తిథిని సంకటహర చతుర్థి అని అంటారు. ఈ రోజు విఘ్ననాయకుడైన గణపతికి అత్యంత ప్రీతికరమైనది. ఈ పవిత్రమైన రోజున భక్తులు ఉపవాసం ఉండి, నిండు మనస్సుతో గణనాథుడిని పూజిస్తారు. ఇలా చేస్తే జీవితంలో సంకటాలు, ఆటంకాలు తొలగిపోయి, శుభాలు కలుగుతాయని వేద పండితులు చెబుతారు. సంకటహర వ్రతాన్ని నేడు ఆచరించడం వలన అనుకున్న పనులు నిర్విఘ్నంగా పూర్తవుతాయని నమ్మకం.
News November 8, 2025
వంగ, బెండ సాగు-తొలిదశలో చీడపీడల నివారణ

వంగ, బెండ మొక్కలపై తొలి దశలో అక్షింతల పురుగు, పెంకు పురుగులను గమనిస్తే ఏరి చంపేయాలి. కొమ్మతొలుచు పురుగు ఆశించిన రెమ్మలను కింది వరకు తుంచి నాశనం చేయాలి. పంట కాపునకు ముందు దశలో పురుగుల నివారణకు లీటరు నీటికి 2.5ml క్లోరిపైరిపాస్, 2.5ml క్వినాల్ఫాస్, 2ml ప్రొఫెనోఫాస్ మందులలో ఏదో ఒకదానిని 5ml వేపమందుతో కలిపి స్ప్రే చేయాలి. అవసరాన్ని బట్టి 7 నుంచి 10 రోజుల వ్యవధిలో మందు మార్చి మరోసారి స్ప్రే చేయవచ్చు.


